News December 11, 2024

తొక్కిసలాట ఘటన.. హైకోర్టుకు అల్లు అర్జున్

image

TG: సంధ్య థియేటర్ వద్ద తొక్కిసలాట ఘటనపై ‘పుష్ప-2’ హీరో అల్లు అర్జున్ హైకోర్టును ఆశ్రయించారు. తనపై నమోదైన కేసును కొట్టేయాలని పిటిషన్ దాఖలు చేశారు. కాగా తొక్కిసలాటలో <<14793383>>మహిళ మరణించిన<<>> సంగతి తెలిసిందే. ఈ ఘటనలో చిక్కడపల్లి పోలీస్ స్టేషన్లో ఆయనపై కేసు నమోదైంది. ఇప్పటికే థియేటర్ యజమాని, మేనేజర్‌తో పాటు సెక్యూరిటీ మేనేజర్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు.

Similar News

News November 21, 2025

NZB: జర్నలిస్టులకు అక్రిడిటేషన్ కార్డులు ఇవ్వాలి: TWJF

image

జర్నలిస్టులకు అక్రిడిటేషన్ కార్డులు ఇవ్వాలని TWJF నిజామాబాద్ జిల్లా శాఖ ఆధ్వర్యంలో ఆడిషనల్ కలెక్టర్ కిరణ్ కుమార్‌కు శుక్రవారం వినతిపత్రం అందజేశారు. మండల కేంద్రాల్లోని విలేకరులకు ఇండ్ల స్థలాలు కేటాయించాలని కోరారు. దాడుల నుంచి జర్నలిస్టులకు రక్షణ కల్పించేందుకు చట్టం చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో వెంకటేష్, రామచందర్ రెడ్డి, రాజు, పరమేశ్వర్, భాస్కర్, ప్రవీణ్, అనిత తదితరులు పాల్గొన్నారు.

News November 21, 2025

OFFICIAL: రెండో టెస్టుకు కెప్టెన్‌గా పంత్

image

గువాహటి వేదికగా రేపటి నుంచి సౌతాఫ్రికాతో జరిగే రెండో టెస్టుకు కెప్టెన్ గిల్ దూరమైనట్లు BCCI ప్రకటించింది. దీంతో జట్టుకు పంత్ నాయకత్వం వహించనున్నట్లు వెల్లడించింది. మెడకు గాయం కారణంగా తొలి టెస్టులోనూ గిల్ బ్యాటింగ్ చేయలేకపోయిన విషయం తెలిసిందే. చికిత్స తర్వాత గువాహటికి వెళ్లినప్పటికీ క్రికెట్ ఆడేందుకు అతను ఫిట్‌గా లేడని BCCI తెలిపింది. మరిన్ని టెస్టులు, చికిత్స కోసం ముంబై వెళ్తున్నట్లు పేర్కొంది.

News November 21, 2025

ఏపీ సచివాలయం వద్ద భద్రత పెంపు

image

AP: రాష్ట్రంలో మావో అగ్రనేత హిడ్మా ఎన్‌కౌంటర్, మరో 51 మంది మావోయిస్టులు అరెస్టయిన నేపథ్యంలో పోలీసులు అప్రమత్తమయ్యారు. వెలగపూడి సచివాలయం వద్ద భద్రతను కట్టుదిట్టం చేశారు. ప్రతి వాహనాన్ని క్షుణ్ణంగా తనిఖీ చేస్తున్నారు. అలాగే ఉద్యోగుల ఐడీ కార్డులను పరిశీలించిన తర్వాతే లోపలికి పంపుతున్నారు. విజయవాడ పరిసరాల్లో మరింత మంది మావోలు ఉండొచ్చనే సమాచారంతో అప్రమత్తంగా వ్యవహరిస్తున్నారు.