News May 10, 2024
తండ్రి కాబోతున్న స్టార్ సింగర్

ప్రముఖ సింగర్ జస్టిన్ బీబర్ తాను తండ్రి కాబోతున్నట్లు ప్రకటించారు. తన భార్య హేలీ బీబర్ గర్భం దాల్చినట్లు అతను సోషల్ మీడియా వేదికగా తెలిపారు. హేలీ బేబీ బంప్‌తో ఉన్న ఫొటోలను పోస్ట్ చేశారు. వీరికి 2018లో వివాహమైంది. బీబర్ రూపొందించిన బేబీ, లెట్ మీ లవ్ యూ, మై వరల్డ్ 2.0 వంటి పాటలు ప్రపంచవ్యాప్తంగా సూపర్ హిట్‌గా నిలిచిన సంగతి తెలిసిందే.
Similar News
News March 11, 2026
కొడుకును వారసుడిగా తిరస్కరించిన ఖమేనీ?

తన కుమారుడు మొజ్తబా వారసుడు కావడం దివంగత ఇరాన్ సుప్రీం లీడర్ అలీ ఖమేనీకి ఇష్టం లేదట. ఈ మేరకు వీలునామాలో స్పష్టంగా పేర్కొన్నట్లు న్యూయార్క్ పోస్ట్ రాసుకొచ్చింది. అయినా IRGC బలవంతంగా మొజ్తబా పేరును ప్రతిపాదించి కొత్త సుప్రీం లీడర్‌గా ఎన్నుకునేలా చేసినట్లు తెలుస్తోంది. కుటుంబ పాలనను వ్యతిరేకించిన అలీ ఖమేనీ నిర్ణయానికి భిన్నంగా సైన్యం ముందుకు వెళ్లడం ఇప్పుడు ఇరాన్ రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారింది.
News March 11, 2026
60 ఏళ్లలో 100 రెట్లు పెరిగిన సిలిండర్ ధర!

దేశంలో డొమెస్టిక్ LPG సిలిండర్ ధరలు 60 ఏళ్లలో భారీగా పెరిగాయి. 1960లో కేవలం ₹7 నుంచి ₹10 మధ్య ఉన్న ధర 2026 నాటికి ఢిల్లీలో ₹913కు చేరుకుంది. 1990లో ₹120, 2010లో ₹400గా ఉన్న ధర నేడు సామాన్యుడిపై పెను భారంగా మారింది. అంతర్జాతీయ ఇంధన ధరల మార్పులు, మారుతున్న సబ్సిడీ విధానాలు & ద్రవ్యోల్బణం కారణంగానే ఈ పెరుగుదల కనిపిస్తోంది. గడిచిన ఆరు దశాబ్దాలలో సిలిండర్ ధర దాదాపు వంద రెట్లు పెరగడం గమనార్హం.
News March 11, 2026
వరి పంటకు పైపాటుగా కాంప్లెక్స్ ఎరువులు వేస్తున్నారా?

వరి పిలకల దశలో యూరియాతో పాటు చాలా మంది రైతులు DAP, 20-20-0 వంటి కాంప్లెక్స్ ఎరువులను ఎకరాకు ఒక బస్తా చొప్పున వేస్తుంటారు. ఈ కాంప్లెక్స్ ఎరువులలో ఉండే భాస్వరం కేవలం 20 నుంచి 25 శాతమే మొక్కలకు అందుతుంది. మిగతాది అంతా భూమిలో మొక్కలకు అందని స్థితిలో మారిపోతుంది. దీనికి బదులు ‘నానో డీఏపీ’ని ఎకరాకు అర లీటరు స్ప్రే చేసుకుంటే మంచి ఫలితాలు వస్తాయని వ్యవసాయ నిపుణులు సూచిస్తున్నారు.


