News December 3, 2024
పెద్దపల్లి జిల్లాపై రాష్ట్ర ప్రభుత్వం నిధుల వర్షం

TG: రేపు పెద్దపల్లిలో సీఎం పర్యటన నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం జిల్లాకు నిధుల వర్షం కురిపించింది. బైపాస్ రోడ్డు నిర్మాణానికి రూ.82 కోట్లు విడుదల చేస్తూ జీవో జారీ చేసింది. పెద్దపల్లి జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిని 50 పడకల నుంచి 100 పడకలకు పెంచుతూ ఉత్తర్వులు జారీ చేసింది. దీని కోసం రూ.51 కోట్లు మంజూరు చేసింది. మంథనిలోని 50 పడకల ఆస్పత్రికి రూ.22 కోట్ల నిధులు విడుదల చేసింది.
Similar News
News April 2, 2026
నా భూమి లాక్కున్నారు.. నటి సోనాలిపై రైతు కేసు!

సీనియర్ నటి సోనాలీ బింద్రే, ఆమె భర్త గోల్డి బెహల్ తన 30 గుంటల భూమిని ఆక్రమించారంటూ పుణేకు చెందిన రైతు చంద్రకాంత్ పోలీసులను ఆశ్రయించారు. ఆ భూమి 1957 నుంచే వంశపారంపర్యంగా వస్తోందని, తనను బెదిరించి ఆక్రమించారని ఆయన ఆరోపిస్తున్నారు. అయితే తాను చట్టబద్ధంగానే ఆ భూమిని కొనుగోలు చేశానని సోనాలి చెబుతున్నారు. తన ప్రతిష్ఠను దెబ్బతీయడానికే ఇలా చేస్తున్నారని, కోర్టులో తేల్చుకుంటానని తెలిపారు.
News April 2, 2026
గుండెల మీద ఆడించిన తండ్రే.. కర్కశంగా చంపేశాడు!

AP: ప్రేమించి పెళ్లి చేసుకున్న భర్తతో ఉంటానని కూతురు చెప్పడాన్ని తండ్రి తట్టుకోలేకపోయాడు. ఆమె గుండెలపై కూర్చొని ఊపిరాడకుండా చేసి, ఆపై ఉరేసి చంపాడు. మాచర్లకు చెందిన చౌడేశ్వరి(22), అదే మండలానికి చెందిన నాగరాజు గత నెల 4న ఇల్లు విడిచి వెళ్లిపోయి పెళ్లి చేసుకున్నారు. కొన్ని రోజులకే మాట్లాడుకుందామని పెద్దలు వారిని మాచర్ల తీసుకురాగా 18న హత్య జరిగింది. పోలీసులు నిన్న నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు.
News April 2, 2026
రాముడి లుక్కు ఫిదా.. VFXపై నెటిజన్ల భిన్నాభిప్రాయాలు!

నితేశ్ తివారీ ‘రామాయణ’ <<19543549>>టీజర్‌పై<<>> SMలో చర్చ మొదలైంది. రాముడిగా రణ్‌బీర్ లుక్ బాగుందని మెచ్చుకుంటున్నారు. అయితే ఇందులోని VFXపై మాత్రం మిశ్రమ స్పందన వస్తోంది. ‘ఆదిపురుష్’ కంటే బెటర్ అని కొందరు.. అంతా ఏఐ వీడియోలా ఉందంటూ మరికొందరు అభిప్రాయపడుతున్నారు. ఈ చిత్రంపై భారీ అంచనాలు ఉండటంతో VFX క్వాలిటీ, గ్రాఫిక్స్ విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలని ఫ్యాన్స్ సూచిస్తున్నారు.


