News October 3, 2025
దేవరగట్టులో ప్రారంభమైన కర్రల సమరం

AP: కర్నూలు(D) హొళగుంద(M) దేవరగట్టులో కర్రల సమరం ప్రారంభమైంది. దసరా సందర్భంగా బన్ని ఉత్సవంలో భాగంగా మాళమ్మ మల్లేశ్వరస్వామి వార్ల ఉత్సవమూర్తులను ఊరేగిస్తున్నారు. వాటిని దక్కించుకోవడానికి 3 గ్రామాల భక్తులు ఒకవైపు, 7 గ్రామాల భక్తులు మరోవైపు కర్రలతో తలపడుతున్నారు. ఈ సమరాన్ని వీక్షించేందుకు భారీ సంఖ్యలో జనం తరలివచ్చారు. ఉత్సవంలో హింస చెలరేగకుండా 800మంది పోలీసులతో బందోబస్తు నిర్వహిస్తున్నారు.
Similar News
News October 3, 2025
ప్రజా రవాణాకు ఇబ్బంది కలగకూడదు: మంత్రి జనార్దన్

AP: ఉత్తరాంధ్రలో భారీ వర్షాల నేపథ్యంలో R&B శాఖ అధికారులతో మంత్రి BC జనార్దన్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. క్షేత్రస్థాయిలో బలహీనంగా ఉన్న రోడ్లు గండ్లు, కోతకు గురయ్యే అవకాశం ఉన్న నేపథ్యంలో అధికారులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ప్రజా రవాణాకు ఇబ్బంది లేకుండా పునరుద్ధరణ పనులు చేపట్టాలన్నారు. ఉమ్మడి శ్రీకాకుళం, విజయనగరం, విశాఖ జిల్లాల్లో సమస్యలు ఉంటే ప్రభుత్వం దృష్టికి తీసుకురావాలని ఆదేశించారు.
News October 3, 2025
‘డియర్ రావణ్’.. నటి ట్వీట్‌పై వివాదం

దసరా వేళ బాలీవుడ్ నటి సిమీ గరేవాల్ చేసిన ట్వీట్ వివాదాస్పదమైంది. ‘డియర్ రావణ్. టెక్నికల్‌గా మీరు చెడ్డవారు కాదు. చిలిపివారు. సీతకు మంచి ఆహారం, ఆశ్రయం ఇచ్చారు. మహిళా సెక్యూరిటీ గార్డ్స్‌ను పెట్టారు. మ్యారేజ్ రిక్వెస్ట్ వినయంగా చేశారు. రాముడు చంపుతున్నప్పుడూ క్షమాపణలు చెప్పారు. మా పార్లమెంట్‌లోని సగం మంది కంటే మీరు చాలా ఎడ్యుకేటెడ్’ అని పేర్కొన్నారు. దీనిపై విమర్శలు రావడంతో పోస్టును డిలీట్ చేశారు.
News October 3, 2025
నేడు క్యాబినెట్ భేటీ.. కీలక అంశాలపై చర్చ

AP: CM చంద్రబాబు అధ్యక్షతన ఇవాళ 3PMకు క్యాబినెట్ భేటీ జరగనుంది. ఈనెల 16న రాష్ట్రంలో ప్రధాని మోదీ పర్యటనకు సంబంధించిన ప్రణాళికపై మంత్రులకు సీఎం దిశానిర్దేశం చేయనున్నారు. కొత్త జిల్లాల ఏర్పాటు, రేపు ఆటో డ్రైవర్లకు అందించనున్న రూ.15 వేల సాయంపై చర్చించే అవకాశముంది. రాజధాని అమరావతిలో అభివృద్ధి పనులు, పలు సంస్థలకు భూ కేటాయింపులపై చర్చించి సీఆర్డీఏ ప్రతిపాదనలను ఆమోదించనున్నారు.