News October 26, 2025

మొంథా తుఫాను పయనమిలా..

image

AP: ఆగ్నేయ బంగాళాఖాతంలోని తీవ్ర వాయుగుండం గడిచిన 6 గంటల్లో 8Kmph వేగంతో కదిలిందని APSDMA తెలిపింది. ప్రస్తుతానికి చెన్నైకి 720km, విశాఖపట్నానికి 790km, కాకినాడకి 780km దూరంలో కేంద్రీకృతమై ఉందని వెల్లడించింది. ఇది 12 గంటల్లో నైరుతి, పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో తుఫానుగా బలపడుతుందని తెలిపింది. మంగళవారం ఉదయానికి తీవ్ర తుఫానుగా మారి, ఆరోజు రాత్రి కాకినాడ సమీపంలో తీరం దాటే ఛాన్స్ ఉందని పేర్కొంది.

Similar News

News February 10, 2026

US ట్రేడ్ డీల్: భారత ఆటో రంగానికి ఢోకా లేదు!

image

అమెరికాతో ట్రేడ్ డీల్ వల్ల డొమెస్టిక్ ఆటోమొబైల్ రంగానికి ముప్పు ఉండదని నిపుణులు అంటున్నారు. సుంకాల తగ్గింపు కొన్ని ప్రీమియం కార్లకు మాత్రమే పరిమితమని వివరించారు. కొన్ని సెగ్మెంట్లలో అయితే కోటా కూడా ఉందని వెల్లడించారు. సుంకాలు సున్నా శాతానికి చేరడానికి పదేళ్ల సమయం పడుతుందని పేర్కొన్నారు. దీంతో సామాన్యులు కొనుగోలు చేసే ఇండియన్ ప్యాసింజర్ వెహికల్ మార్కెట్‌పై ప్రభావం ఉండబోదని వివరిస్తున్నారు.

News February 10, 2026

‘కుంభ’.. ఛాలెంజింగ్ పాత్ర: పృథ్వీరాజ్

image

‘వారణాసి’ మూవీలో తన కుంభ పాత్ర సవాలుతో కూడుకున్నదని నటుడు పృథ్వీరాజ్ సుకుమారన్ అన్నారు. ‘ఇది నేను చేసిన, రాజమౌళి ఊహించిన అత్యంత క్లిష్టమైన రోల్. కుంభ చెప్పే, చేసే ప్రతీది గతంతో ముడిపడి ఉంటుంది. ముఖం, కళ్లతోనే నా భావోద్వేగాలను తెలియజేయాలి. సినిమా కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నా’ అని ఓ ఇంటర్వ్యూలో తెలిపారు. ప్రతి క్యారెక్టర్ తెరపై ఎలా కనిపించాలో స్పష్టత కలిగిన దర్శకుడు రాజమౌళి అని ప్రశంసించారు.

News February 10, 2026

గాయిటర్ వ్యాధి గురించి తెలుసా?

image

థైరాయిడ్‌ గ్రంథి అసాధారణమైన సైజుకు పెరగడాన్నే గాయిటర్‌ అంటారు. ఇది రెండు రకాలు. సాధారణం కంటే థైరాయిడ్‌ గ్రంథి ఉబ్బిపోవడాన్ని డిఫ్యూస్‌ గాయిటర్‌ అని, థైరాయిడ్‌ గ్రంథిలో గడ్డలు పెరగడాన్ని నాడ్యులార్‌ గాయిటర్‌ అని అంటారు. దీనివల్ల గొంతు దగ్గర బాగా ఉబ్బడం, థైరాయిడ్‌ హార్మోన్ స్రావంలో హెచ్చుతగ్గులు వస్తాయి. నిర్ధారణ కోసం థైరాయిడ్‌ ప్రొఫైల్‌ పరీక్షలు T3, T4, TSH, అల్ట్రాస్కాన్, NFAC పరీక్షలు చేస్తారు.