News April 25, 2024

బ్రాండేమో బలం.. జట్టేమో బలహీనం!

image

ఒక్కసారి కూడా IPL ట్రోఫీ గెలవకపోయినా బ్రాండ్, ఫేమ్ విషయంలో RCBని కొట్టే జట్టే లేదంటే అతిశయోక్తి కాదు. 2024లో RCB బ్రాండ్ వాల్యూ 28% పెరిగి $10.7బిలియన్లకు చేరుకుంది. అయితే.. మైదానంలో ఆ జట్టు ప్రదర్శన అంతంతమాత్రమే. ఘోరమైన రికార్డులన్నీ RCBపైనే నమోదవుతాయనే ఓ అపవాదు కూడా ట్రెండ్ అవుతోంది. కాగా.. గెలవాలంటే బలమైన బ్యాటింగ్ ఒక్కటే సరిపోదని, బౌలింగ్ కూడా ఉండాలని విశ్లేషకులు అంటున్నారు.

Similar News

News February 10, 2026

‘కుంభ’.. ఛాలెంజింగ్ పాత్ర: పృథ్వీరాజ్

image

‘వారణాసి’ మూవీలో తన కుంభ పాత్ర సవాలుతో కూడుకున్నదని నటుడు పృథ్వీరాజ్ సుకుమారన్ అన్నారు. ‘ఇది నేను చేసిన, రాజమౌళి ఊహించిన అత్యంత క్లిష్టమైన రోల్. కుంభ చెప్పే, చేసే ప్రతీది గతంతో ముడిపడి ఉంటుంది. ముఖం, కళ్లతోనే నా భావోద్వేగాలను తెలియజేయాలి. సినిమా కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నా’ అని ఓ ఇంటర్వ్యూలో తెలిపారు. ప్రతి క్యారెక్టర్ తెరపై ఎలా కనిపించాలో స్పష్టత కలిగిన దర్శకుడు రాజమౌళి అని ప్రశంసించారు.

News February 10, 2026

గాయిటర్ వ్యాధి గురించి తెలుసా?

image

థైరాయిడ్‌ గ్రంథి అసాధారణమైన సైజుకు పెరగడాన్నే గాయిటర్‌ అంటారు. ఇది రెండు రకాలు. సాధారణం కంటే థైరాయిడ్‌ గ్రంథి ఉబ్బిపోవడాన్ని డిఫ్యూస్‌ గాయిటర్‌ అని, థైరాయిడ్‌ గ్రంథిలో గడ్డలు పెరగడాన్ని నాడ్యులార్‌ గాయిటర్‌ అని అంటారు. దీనివల్ల గొంతు దగ్గర బాగా ఉబ్బడం, థైరాయిడ్‌ హార్మోన్ స్రావంలో హెచ్చుతగ్గులు వస్తాయి. నిర్ధారణ కోసం థైరాయిడ్‌ ప్రొఫైల్‌ పరీక్షలు T3, T4, TSH, అల్ట్రాస్కాన్, NFAC పరీక్షలు చేస్తారు.

News February 10, 2026

గాయిటర్ వ్యాధి చికిత్స

image

థైరాయిడ్‌ గ్రంథి అయోడిన్‌ను గ్రహించి దాన్ని థైరాయిడ్‌ హార్మోన్లుగా మారుస్తుంది. అయోడిన్‌ లోపిస్తే గాయిటర్‌ జబ్బు వస్తుంది. థైరాయిడ్‌ సమస్య నిర్ధారణ కోసం చేసే పరీక్షల ఫలితాల ఆధారంగా ఎండోక్రైనాలజిస్ట్‌ ఆధ్వర్యంలో తగిన చికిత్స చేస్తారు. థైరాయిడ్‌ వ్యవస్థను సరిచేయడం ద్వారా కొంతమందిలో గాయిటర్‌ తగ్గుముఖం పడుతుంది. సాధారణంగా గాయిటర్‌ సమస్యను ఎలాంటి శస్త్రచికిత్స అవసరం లేకుండానే నయం చేయవచ్చు.