News August 24, 2024
యూనిఫైడ్ పెన్షన్ స్కీమ్ స్వరూపం ఇలా..

కేంద్ర ఉద్యోగులకు వచ్చే APR 1 నుంచి <<13933856>>యూనిఫైడ్ పెన్షన్ స్కీమ్<<>> అమల్లోకి రానుంది. ఇందులో 3 భాగాలుంటాయి.
Assured pension: 25ఏళ్ల సర్వీసు పూర్తయితే, రిటైర్మెంట్కు ముందు 12నెలల సగటు బేసిక్ శాలరీలో 50% పెన్షన్ లభిస్తుంది.
Family Pension: పెన్షనర్ చనిపోతే అతని పెన్షన్లో 60% ఫ్యామిలీకి ఇస్తారు.
Minimum pension: 10ఏళ్ల సర్వీసు పూర్తిచేసుకున్న ఉద్యోగికి రిటైర్మెంట్ తర్వాత ₹10వేల పెన్షన్ లభిస్తుంది.
Similar News
News December 13, 2025
డిసెంబర్ 13: చరిత్రలో ఈ రోజు

1952: దక్షిణ భారత నటి లక్ష్మి జననం
1955: కేంద్ర మాజీ మంత్రి మనోహర్ పారికర్ జననం
1960: విక్టరీ వెంకటేశ్(ఫొటోలో) జననం
1961: భారత దిగ్గజ క్రికెటర్ అలీఖాన్ పటౌడీ టెస్టుల్లోకి అరంగేట్రం చేసిన రోజు
1986: హిందీ నటి స్మితా పాటిల్ మరణం
1990: హీరోయిన్ రెజీనా జననం
2001: భారత పార్లమెంటుపై ఉగ్రవాదులు దాడికి పాల్పడిన రోజు
News December 13, 2025
పుట్టినరోజు శుభాకాంక్షలు

ఈ రోజు పుట్టినరోజు జరుపుకుంటున్న అందరికీ శుభాకాంక్షలు. పరిమితుల దృష్ట్యా ఫొటో ఎంపిక కాని వారు మన్నించగలరు. > ఫొటో, పేరు, ఊరు, పుట్టిన తేదీ వివరాలతో.. teluguteam@way2news.comకు SUBJECT: BIRTHDAYతో ముందురోజు (ex: MAY 1న పుట్టినరోజు అయితే APR 30న) ఉదయం గం.8:00-08:05 లోపు మెయిల్ చేయండి. పుట్టినరోజున మీ సన్నిహితులను ఆశ్చర్యపర్చండి.
News December 13, 2025
నోబెల్ శాంతి బహుమతి గ్రహీత అరెస్టు

నోబెల్ శాంతి బహుమతి గ్రహీత (2023) నర్గెస్ మొహమ్మదిని ఇరాన్ భద్రతా దళాలు అరెస్ట్ చేశాయి. ఇటీవల అనుమానాస్పద స్థితిలో మరణించిన ప్రముఖ న్యాయవాది ఖోస్రో అలికోర్డి స్మారక కార్యక్రమానికి హాజరైనప్పుడు ఆమెతో పాటు పలువురు కార్యకర్తలను అదుపులోకి తీసుకున్నారు. కాగా మహిళా హక్కుల కోసం పోరాడుతున్న ఆమె గత పదేళ్లలో ఎక్కువ కాలం జైలులోనే గడిపారు. 2024లో తాత్కాలిక బెయిల్పై విడుదలయ్యారు.


