News July 31, 2024
నిర్మాతల మండలి తీరు కరెక్ట్ కాదు: కార్తి

ఈ ఏడాది నవంబరు 1 తర్వాత సినిమాల షూటింగ్‌కు అనుమతి లేదంటూ తమిళ సినీ నిర్మాతల మండలి తీర్మానించడంపై నడిగర్ సంఘం కోశాధికారి కార్తి ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘వేలాదిమంది కార్మికుల జీవితాలకు సంబంధించిన ఇలాంటి నిర్ణయాలను అన్ని సంఘాలతో చర్చించిన తర్వాతే తీసుకోవాలి. ఈ తీరు సరికాదు. ధనుష్‌పై చర్యలు తీసుకుంటామన్నారు కానీ ఇప్పటి వరకు మా సంఘానికి ఎటువంటి ఫిర్యాదు రాలేదు’ అని వెల్లడించారు.
Similar News
News September 17, 2025
కాలీఫ్లవర్‌లో బటనింగ్ తెగులు – నివారణ

కాలీఫ్లవర్ పంటలో చిన్న చిన్న పూలు ఏర్పడటాన్ని బటనింగ్ అంటారు. ముదురు నారు నాటడం, నేలలో నత్రజని లోపం, స్వల్పకాలిక రకాలను ఆలస్యంగా నాటడం వల్ల ఈ సమస్య వస్తుంది. దీని నివారణకు 21 నుంచి 25 రోజులు గల నారుని నాటుకోవాలి. సిఫారసు చేసిన మోతాదులో నత్రజని ఎరువులను వేయాలి. స్వల్పకాలిక రకాలను సిఫారసు చేసిన సమయంలో విత్తడం వల్ల ఈ సమస్యను నివారించవచ్చని వ్యవసాయ నిపుణులు సూచిస్తున్నారు.
News September 17, 2025
నమో డ్రోన్ దీదీ పథకం గురించి తెలుసా?

మహిళా సాధికారత కోసం కేంద్రం పలు పథకాలు ప్రవేశపెట్టింది. అందులో ఒకటే <
News September 17, 2025
పాకిస్థాన్ మ్యాచులకు రిఫరీగా రిచర్డ్సన్!

ఆసియా కప్: షేక్‌హ్యాండ్ వివాదంలో రిఫరీ ఆండీ పైక్రాఫ్ట్‌ని తొలగించాలని పాకిస్థాన్ డిమాండ్ చేసిన విషయం తెలిసిందే. ఆయన్ను ఆసియా కప్ నుంచి తొలగించకపోతే తాము UAEతో మ్యాచ్ ఆడబోమని ప్రకటించింది. ఈ నేపథ్యంలో పాక్ మ్యాచులకు పైక్రాఫ్ట్‌ను ICC దూరం పెట్టినట్లు తెలుస్తోంది. UAEతో మ్యాచ్‌కు రిఫరీగా రిచర్డ్సన్ను నియమించినట్లు PCB సభ్యుడు చెప్పారని PTI కథనం ప్రచురించింది.