News December 3, 2024

విశ్వబ్రాహ్మణుల ఉపకులాలను ఒకటిగానే పరిగణిస్తాం: ప్రభుత్వం

image

TG: విశ్వబ్రాహ్మణ కులాలకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇందులోని ఉపకులాలన్నింటిని కలిపి ఒకటిగానే పరిగణిస్తామని హైకోర్టుకు నివేదించింది. సర్వేలో వేర్వేరు సబ్ కేటగిరీలుగా ఉన్నా, ఒకే కులంగా తీసుకుంటామంది. కాగా విశ్వబ్రాహ్మణులను వేర్వేరు కులాలుగా పరిగణించడంపై దాఖలైన పిటిషన్‌పై హైకోర్టులో విచారణ సందర్భంగా ప్రభుత్వం ఈ మేరకు వివరణ ఇచ్చింది.

Similar News

News November 26, 2025

వచ్చే ఏడాది చివరికి కిలో వెండి రూ.6 లక్షలు: కియోసాకి

image

బంగారం, వెండి ధరలు భవిష్యత్తులో మరింతగా పెరుగుతాయని రచయిత, బిజినెస్‌మ్యాన్ రాబర్ట్ కియోసాకి అంచనా వేశారు. ప్రస్తుతం అంతర్జాతీయ మార్కెట్‌లో 50 డాలర్లుగా ఉన్న ఔన్స్ వెండి ధరలు త్వరలోనే 7 డాలర్లకు పెరగవచ్చని, వచ్చే ఏడాది చివరికి 200 డాలర్లకు చేరుకోవచ్చని అంచనా వేస్తున్నారు. అదే జరిగితే ప్రస్తుతం ఢిల్లీ మార్కెట్‌లో రూ.1.55 లక్షలు ఉన్న కిలో వెండి ధర రూ.6.2 లక్షలకు పెరిగే ఛాన్స్ ఉంది.

News November 26, 2025

వేరుశనగ పంటకు నీటిని ఏ సమయంలో అందించాలి?

image

వేరుశనగను విత్తే ముందు నేల తడిచేలా నీరు పెట్టి తగినంత పదును ఉన్నప్పుడు విత్తనం వేసుకోవాలి. మొదటి తడిని మొలక వచ్చిన 20-25 రోజులకు ఇవ్వాలి. దీని వల్ల పైరు ఒకేసారి పూతకు వచ్చి, ఊడలు కూడా సరిగా ఏర్పడి దిగుబడి బాగుంటుంది. తర్వాత నేల లక్షణం, బంక మట్టి శాతాన్ని బట్టి 7-10 రోజులకు ఒక నీటి తడినివ్వాలి. చివరి తడిని పంట కోతకు 4-7 రోజుల మధ్య అందించాలి. దీని వల్ల మొక్కలు పీకడం సులభం. గింజలు నేలలో ఉండిపోవు.

News November 26, 2025

750పోస్టులు.. దరఖాస్తు గడువు పొడిగింపు

image

పంజాబ్ నేషనల్ బ్యాంకులో 750 LBO పోస్టులకు అప్లై చేయడానికి దరఖాస్తు గడువును పొడిగించారు. ఈనెల 23తో గడువు ముగియగా.. DEC 1వరకు పొడిగించారు. డిగ్రీ ఉత్తీర్ణులైన 20-30 ఏళ్ల మధ్య ఉన్నవారు అప్లై చేసుకోవచ్చు. రాత పరీక్ష, స్క్రీనింగ్ టెస్ట్, లోకల్ లాంగ్వేజ్ టెస్ట్, ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు. జీతం నెలకు రూ.48,480 నుంచి రూ.85,920 వరకు ఉంటుంది. పరీక్ష డిసెంబర్ లేదా జనవరిలో నిర్వహిస్తారు.