News March 6, 2025

ట్రంకు పెట్టెలో కారీలు.. వాళ్లంతా ఏమైపోయినట్లు?

image

చిన్నతనంలో ఉదయం లేవగానే చాయ్ తాగుతూ కారీలు, బన్నులు తినేవాళ్లం గుర్తుందా? ‘బొంబాయ్ కారీలు’ అని అరుస్తూ ట్రంకు పెట్టెలను తలపై పెట్టుకొని కొందరు గల్లీల్లో తిరిగేవారు. 90s బ్యాచ్‌కు వీరితో ప్రత్యేక అనుబంధం ఉండేది. ఇప్పుడు వారంతా కనుమరుగైపోయారు. వీరు మన ఇళ్ల మీదుగా వెళ్తుంటే కారీల వాసనకు నోరూరేది. ఇప్పుడంతా కల్తీ అయిపోవడంతో వీటిని తినడమూ చాలా మంది మానేశారు. బొంబాయ్ కారీలు మీరెప్పుడైనా తిన్నారా?

Similar News

News March 6, 2025

సింగిల్స్‌లో ‘కింగ్’.. కోహ్లీ

image

క్రికెట్‌లో సిక్సులు, ఫోర్ల కంటే ఒక ఇన్నింగ్స్‌ను ముందుకు తీసుకెళ్లడానికి సింగిల్స్, డబుల్స్ చాలా కీలకం. ఈ విషయంలో కింగ్ కోహ్లీది అందెవేసిన చేయి. విరాట్ 301 వన్డేల్లో 14,180 రన్స్ చేస్తే అందులో సింగిల్స్ ద్వారానే 5,870 పరుగులు వచ్చాయి. 2000 JAN నుంచి ODI క్రికెట్‌లో ఓ బ్యాటర్‌కు ఇవే అత్యధికం. ఆ తర్వాతి స్థానాల్లో సంగక్కర(5,503), జయవర్దనే(4,789), ధోనీ(4,470), పాంటింగ్(3,916), రోహిత్(3,759) ఉన్నారు.

News March 6, 2025

ఈ నెల 15 నుంచి ఒంటిపూట బడులు

image

తెలంగాణలో ఈ నెల 15 నుంచి ఒంటిపూట బడులు నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ప్రభుత్వ, ఎయిడెడ్, ప్రైవేట్ స్కూళ్లు ఉ.8 గంటలకు ప్రారంభమై మధ్యాహ్నం 12.30 వరకు జరుగుతాయి. ఏప్రిల్ 23 వరకు ఇలాగే స్కూళ్ల టైమింగ్స్ కొనసాగుతాయి. టెన్త్ పరీక్షలు జరిగే స్కూళ్లల్లో మాత్రం మధ్యాహ్నం పూట క్లాసులు జరుగుతాయి. అటు ఎండల తీవ్రత దృష్ట్యా ఈ నెల 15కు ముందే ఒంటిపూట బడులు నిర్వహించాలని పేరెంట్స్ డిమాండ్ చేస్తున్నారు.

News March 6, 2025

బ్యాంకులకు RBI శుభవార్త

image

నిధుల్లేక నైరాశ్యంతో ఉన్న బ్యాంకులకు ఉత్తేజం తెచ్చేలా ఆర్బీఐ కీలక నిర్ణయం తీసుకుంది. బ్యాంకింగ్ వ్యవస్థలో రూ.2లక్షల కోట్లు తీసుకొచ్చే ప్రయత్నాలు చేస్తోంది. సెక్యూరిటీల కొనుగోలు, డాలర్-రూపాయి స్వాప్ వంటి చర్యల ద్వారా నెల రోజుల్లో రూ.1.9లక్షల కోట్లు తీసుకురావాలని భావిస్తోంది. ఈ నెల 12, 18 తేదీల్లో రూ.1లక్షల కోట్లకు సమానమైన ప్రభుత్వ సెక్యూరిటీలను కొనుగోలు చేయనుంది.

error: Content is protected !!