News December 20, 2024
సారాంశం ఏంటంటే: అదానీ.. సొరోస్.. అంబేడ్కర్

పార్లమెంటు శీతాకాల సమావేశాల్లో చర్చ కన్నా రభసే ఎక్కువగా జరిగింది. NDA, INDIA పరస్పరం విమర్శల కత్తులు దూసుకున్నాయి. మొదట అదానీ అంశంపై కాంగ్రెస్ ఆందోళన చేసింది. సొరోస్తో సోనియా, రాహుల్ సంబంధాలతో BJP దాన్ని తిప్పికొట్టింది. రాజ్యాంగం, అంబేడ్కర్పై అమిత్ షా ప్రసంగాన్ని ట్రిమ్ చేసి కాంగ్రెస్ రచ్చ మొదలెట్టింది. కాదు మీరే బాబాసాహెబ్ను అవమానించారని BJP ఎదురుదాడికి దిగింది. ఇక MPల తోపులాట ఓ కొసమెరుపు!
Similar News
News October 19, 2025
నోబెల్ అవార్డు గ్రహీత కన్నుమూత

నోబెల్ అవార్డు గ్రహీత, భౌతిక శాస్త్రవేత్త చెన్ నింగ్ యంగ్ కన్నుమూశారు. 1922లో జన్మించిన ఆయన కణ భౌతిక శాస్త్రంలో సైంటిస్టుగా ఎదిగారు. 1957లో పరిశోధనలకుగానూ నోబెల్ బహుమతి అందుకున్నారు. 1964లో అమెరికా పౌరసత్వం పొందగా 2015లో వదులుకున్నారు. చైనా సంస్కృతి నరనరాల్లో ఉండటమే దానికి కారణమని ఓ సందర్భంలో చెప్పారు. ఆయన మరణాన్ని స్థానిక మీడియా ధ్రువీకరించింది.
News October 19, 2025
నేడు ఇలా చేస్తే చాలా మంచిది

నరక చతుర్దశి రోజున పొద్దున్నే లేచి, నువ్వుల నూనెతో తలంటుకుని, నెత్తిపై ఉత్తరేణి కొమ్మ ఉంచుకొని స్నానం చేస్తే శుభ ఫలితాలు కలుగుతాయని పండితులు చెబుతున్నారు. ‘నల్ల నువ్వులతో ‘యమాయ తర్పయామి’ అంటూ యమ తర్పణాలు వదలాలి. ఇది నరకాసురుడు మరణించిన సమయం. ఈ తర్పణం, యమధర్మరాజు శ్లోక పఠనం ద్వారా పాపాలు హరించి, నరకం నుంచి రక్షణ లభిస్తుంది. ఇంట్లో ముగ్గులు వేసి, మినప వంటకాలు తినడం శుభప్రదం’ అని సూచిస్తున్నారు.
News October 19, 2025
దీపావళి రోజున లక్ష్మీ పూజ ఎందుకు చేయాలి?

దీపావళి రోజున లక్ష్మీదేవి భూలోకానికి వచ్చి తన తేజస్సుతో అజ్ఞానమనే చీకటిని తరిమివేసి, భక్తులను అనుగ్రహిస్తుందని పురాణాలు చెబుతున్నాయి. అందుకే పండుగ నాడు దీపాలు పెట్టి అమ్మవారిని ఆహ్వానించాలనే ఆచారాన్ని పాటిస్తున్నాం. దీనివల్ల మనపై దేవి అనుగ్రహం చూపుతారని, ఆర్థిక స్థితి మెరుగై, కుటుంబంలోని అడ్డంకులు తొలగిపోతాయని విశ్వాసం.
* రోజూ ఆధ్యాత్మిక సమాచారం కోసం <<-se_10013>>భక్తి కేటగిరీ<<>>కి వెళ్లండి.