News April 13, 2025

రాష్ట్రంలో మరింత మండిపోనున్న ఎండలు

image

తెలంగాణలో ఎండ తీవ్రత రోజురోజుకూ పెరుగుతోందని వాతావరణ శాఖ హెచ్చరిస్తోంది. ఇవాళ అత్యధికంగా మంచిర్యాల జిల్లాలో 43.6 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. అన్ని జిల్లాల్లో పగటి ఉష్ణోగ్రతలు దాదాపు 40-44 డిగ్రీల మధ్య నమోదవుతున్నాయి. ఏప్రిల్ 18 నుంచి వడగాలులు మరింత తీవ్రంగా ఉండే ప్రమాదం ఉందని చెబుతున్నారు. అయితే, ఏప్రిల్ 15-17 మధ్య మాత్రం కొన్ని ప్రాంతాల్లో ఉరుములతో కూడిన వర్షం కురిసే అవకాశం ఉందని తెలిపారు.

Similar News

News April 13, 2025

సియాచిన్ డే: భారత జవాన్ల ధీరత్వానికి సెల్యూట్

image

భారత ఆర్మీ ఇవాళ సియాచిన్ డే సందర్భంగా జవాన్ల సేవలను స్మరించుకుంది. ప్రపంచంలోనే ఎత్తైన యుద్ధ భూమిగా పేరుగాంచిన సియాచిన్‌లో భారత ఆర్మీ 1984లో ఇదే రోజున ఆపరేషన్‌ మేఘదూత్ చేపట్టి కీలక ప్రాంతాలను స్వాధీనం చేసుకుంది. పాక్ సరిహద్దులోని సియాచిన్‌పై పూర్తి పట్టు సాధించింది. దశాబ్దాలుగా అక్కడి విపరీత వాతావరణ పరిస్థితులను తట్టుకుని రక్షణగా నిలుస్తున్న జవాన్ల ధీరత్వానికి సెల్యూట్.

News April 13, 2025

అటు ప్రీతి జింటా, ఇటు కావ్యా మారన్(VIRAL)

image

SRH-PBKS మ్యాచ్ సందర్భంగా ఆయా జట్ల ఓనర్లు కావ్యా మారన్, ప్రీతి జింటా ఉప్పల్‌లో సందడి చేశారు. తమ ప్లేయర్లు సిక్సర్లు, ఫోర్లు కొట్టినప్పుడు, వికెట్లు పడినప్పుడు వారు ఇచ్చిన హావభావాలు సోషల్ మీడియాలో వైరలవుతున్నాయి. అభిషేక్ శర్మ సెంచరీ చేయగానే కావ్యా అతని పేరెంట్స్‌ దగ్గరికెళ్లి అభినందనలు తెలిపారు. మ్యాచ్ తర్వాత అభిషేక్ ట్రేడ్ మార్క్ సెలబ్రేషన్‌ను గుర్తుచేస్తూ ప్రీతి కంగ్రాట్స్ చెప్పడం విశేషం.

News April 13, 2025

జావెలిన్ త్రోయర్‌పై నాలుగేళ్ల నిషేధం

image

భారత జావెలిన్ త్రోయర్ డీపీ మనుపై NADA నాలుగేళ్ల నిషేధం విధించింది. గతేడాది ఏప్రిల్‌లో జరిగిన గ్రాండ్ ప్రిక్స్-1 సందర్భంగా అతడి నుంచి శాంపిల్స్ సేకరించగా నిషేధిత పదార్థం వాడినట్లు తేలింది. ఆ పోటీల్లో మను విజేతగా నిలవడం గమనార్హం. అయితే డోపింగ్ టెస్టులో విఫలం కావడంతో అతడిపై నాడా తాత్కాలిక నిషేధం విధించింది. మనుపై 2028 వరకు నిషేధం కొనసాగించనున్నట్లు తాజాగా ప్రకటించింది.

error: Content is protected !!