News January 14, 2025

ఉత్తరాయణంలోకి సూర్యుడు

image

సంక్రాంతి రోజైన ఇవాళ సూర్యుడు ధనస్సు రాశిని వీడి మకర రాశిలోకి ప్రవేశిస్తాడు. ఇవాళ మకర సంక్రమణ ప్రారంభమవుతుంది. దీంతో దక్షిణాయణం పూర్తయి ఉత్తరాయణ పుణ్యకాలం మొదలవుతుంది. కాగా ఈ పండుగ అన్నింటిలోకెల్లా విశిష్ఠమైనదని పండితులు చెబుతారు. ఇవాళ సూర్యుడిని ఆరాధిస్తే మంచి జరుగుతుందని నమ్మకం. ఉత్తరాయణంలో చలి తీవ్రత తగ్గుముఖం పడుతుంది.

Similar News

News January 14, 2025

పసుపు బోర్డుతో రైతుల కల నెరవేరింది: బండి

image

TG: నిజామాబాద్‌లో పసుపు బోర్డు ఏర్పాటుతో పండగ రోజు రైతుల కల నెరవేరిందని కేంద్రమంత్రి బండి సంజయ్ అన్నారు. దీని ద్వారా వారి జీవితాల్లో కొత్త వెలుగులు రానున్నట్లు చెప్పారు. ఎంపీ అర్వింద్ పట్టుదలతో తన హామీ నెరవేర్చుకున్నారని చెప్పారు. రైతుల కోసం పనిచేసే పార్టీ బీజేపీ అని స్పష్టం చేశారు. ప్రధాని మోదీకి రైతులు తమ ఆశీర్వాదం అందించాలని బండి కోరారు.

News January 14, 2025

నలుగురు పిల్లలుంటే 400 ఎకరాలు ఉన్నట్టు: CBN

image

AP: మనదేశానికి జనాభే అతిపెద్ద ఆదాయ వనరు అని సీఎం చంద్రబాబు అన్నారు. ‘ఒకప్పుడు నేను పాపులేషన్ కంట్రోల్ అని చెప్పా. కానీ ఇప్పుడు పాపులేషన్ మేనేజ్‌మెంట్ అని చెబుతున్నా. పిల్లలే మీ ఆస్తి. నలుగురు పిల్లలుంటే 400 ఎకరాలు ఉన్నట్టు. జపాన్, సౌత్ కొరియా తదితర దేశాల్లో యువత లేక మనవాళ్లను అడుగుతున్నారు. ఇటీవల MP ప్రభుత్వం కూడా నలుగురు పిల్లల్ని కంటే రూ.లక్ష బహుమతి ఇస్తామని ప్రకటించింది’ అని CBN తెలిపారు.

News January 14, 2025

‘ప్లేయర్ ఆఫ్ ది డిసెంబర్’గా బుమ్రా

image

BGTలో అదరగొట్టి ప్లేయర్ ఆఫ్ ది సిరీస్‌గా ఎంపికైన స్టార్ బౌలర్ బుమ్రా మరో ఘనత సాధించారు. డిసెంబర్ నెలకు గాను ఐసీసీ ‘ప్లేయర్ ఆఫ్ ది మంత్’ అవార్డును సొంతం చేసుకున్నారు. గత నెలలో 3 మ్యాచ్‌లలోనే బుమ్రా 22 వికెట్లు పడగొట్టిన విషయం తెలిసిందే. మహిళల విభాగంలో ఆస్ట్రేలియాకు చెందిన అన్నాబెల్ ప్లేయర్ ఆఫ్ ది మంత్ అవార్డును గెలుచుకున్నారు.