News March 19, 2024
ఎన్నికల్లో తగ్గేదేలే అంటున్న ‘సూపర్ సీనియర్లు’!
ఈ లోక్సభ ఎన్నికల్లో ఫస్ట్ టైమ్ ఓటర్లతో పాటు ‘సూపర్ సీనియర్లు’ ప్రత్యేక ఆకర్షణగా నిలవనున్నారు. వీరు 1952లో దేశంలో జరిగిన తొలి ఎన్నికల నుంచి ఇప్పటివరకు ఓటు హక్కు వినియోగించుకుంటున్నారు. ఒక్క యూపీలోని ప్రయాగ్రాజ్లోనే 1049 మంది ఈ ‘సూపర్ సీనియర్’ ఓటర్లు ఉన్నారట. వీరి వయసు 100-120ఏళ్ల మధ్య ఉన్నట్లు ఎన్నికల సంఘం వెల్లడించింది. వీరిలో 414 మంది ఓటర్లు పురుషులు కాగా 440 మంది మహిళలు ఉండటం విశేషం.
Similar News
News January 7, 2025
ఈ కోడి గుడ్డు ధర రూ.700
AP: సాధారణంగా బ్రాయిలర్ కోడి గుడ్డు ధర రూ.6-8, నాటు కోడి గుడ్డు అయితే రూ.10-13 పలుకుతుంది. అయితే పందెం కోడి గుడ్డుకు రూ.400-700 వరకు డిమాండ్ ఉంటోంది. తూర్పు కోడి, ఎర్ర కక్కెర, తెల్ల కోడి గుడ్డు రూ.400 వరకు, తెల్ల కెక్కర, ఎర్రమైల, అబ్రాసు మైల జాతుల గుడ్డు రూ.700 వరకు పలుకుతోంది. ఈ గుడ్లను ప్రత్యేక నాటుకోళ్లతో పొదిగిస్తారు. కొత్తపట్నం, సింగరాయకొండ మండలాల్లో చాలా మందికి ఇదొక కుటీర పరిశ్రమగా మారింది.
News January 7, 2025
కాంగ్రెస్ మోసంపై నిరసనలు ఢిల్లీకి చేరాయి: కేటీఆర్
TG: కాంగ్రెస్ అంటేనే కన్నింగ్ అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విమర్శించారు. రైతు భరోసాపై కాంగ్రెస్ ప్రభుత్వం యూ టర్న్ తీసుకోవడంపై ఢిల్లీలోని ఏఐసీసీ ఆఫీసు వద్ద పోస్టర్లు వెలిశాయని తెలిపారు. ‘రైతు డిక్లరేషన్’ ఎలా అమలవుతుందో రాష్ట్రానికి వచ్చి వివరించవచ్చు కదా అని రాహుల్ గాంధీని ప్రశ్నించారు. ‘అబద్ధాల కాంగ్రెస్లో అన్ని అరకొర గ్యారంటీలు, అర్ధ సత్యాలే’ అని ట్వీట్ చేశారు.
News January 7, 2025
వెండి నగలకూ హాల్ మార్కింగ్!
బంగారం ఆభరణాల మాదిరే వెండి నగలకూ హాల్మార్క్ తప్పనిసరి చేయాలని కేంద్రం భావిస్తోంది. ఈ ప్రతిపాదనను పరిశీలించాలని BISను కోరినట్లు కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి వెల్లడించారు. అమలు సాధ్యాసాధ్యాలు, వినియోగదారులు, డీలర్ల స్పందనలను తెలుసుకోవాలని కోరినట్లు చెప్పారు. అవసరమైన చర్చల తర్వాతే ప్రక్రియ మొదలుపెడతామన్నారు. అటు 3-6 నెలల్లో ఈ విధానం అమలుకు సిద్ధంగా ఉన్నట్లు BIS డైరెక్టర్ ప్రమోద్ కుమార్ చెప్పారు.