News March 18, 2024

‘ఎలక్టోరల్ బాండ్ల’పై డెడ్‌లైన్ విధించిన సుప్రీంకోర్టు

image

ఎలక్టోరల్ బాండ్ల విషయంలో ఎస్బీఐ సెలక్టివ్‌గా ఉండకూడదని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ఏ పార్టీకి ఎంత ఇచ్చారో తెలిపేలా యునిక్ నంబర్లను ఈసీకి అందజేయాలని ఇవాళ <<12876842>>ఆదేశించిన<<>> సుప్రీంకోర్టు.. ఇందుకోసం డెడ్‌లైన్ విధించింది. కచ్చితంగా ఈ నెల 21న సాయంత్రం 5లోపు అఫిడవిట్ దాఖలు చేయాలని స్పష్టం చేసింది. బాండ్ల విషయంలో ప్రతి సమాచారం బయటకు రావాలని, సందేహాలకు తావుండకూడదని తేల్చిచెప్పింది.

Similar News

News July 1, 2024

DOCTORS DAY: వైద్యో నారాయణో హరి!

image

వైద్యులు దేవుళ్లతో సమానమని చెబుతుంటారు. తల్లిదండ్రులు జన్మనిస్తే వారు పునర్జన్మనిస్తారు. ఎంతటి వ్యాధినైనా నయం చేస్తోన్న వైద్యుల దినోత్సవం నేడు. కరోనాను ఎదుర్కోవడంలో ప్రాణాలను సైతం లెక్క చేయకుండా కోట్లాది మందిని కాపాడారు. వారి సేవలను నెటిజన్లు గుర్తు చేసుకుంటున్నారు. గ్రామీణ ప్రాంతంలో ఇంటికే ప్రాథమిక వైద్య సదుపాయాన్ని అందిస్తోన్న వైద్యులకు సెల్యూట్ చేస్తూ ప్రశంసిస్తున్నారు.

News July 1, 2024

నేషనల్ డాక్టర్స్ డే.. ఈరోజే ఎందుకంటే?

image

పశ్చిమ బెంగాల్‌ రెండో సీఎం బిధాన్ చంద్ర రాయ్ ఒక ప్రముఖ వైద్యుడు. డాక్టర్‌గా, సీఎంగా వైద్య రంగంలో ఆయన చేసిన సేవలకు గౌరవ సూచకంగా బిధాన్ పుట్టిన రోజైన జులై 1ని భారత ప్రభుత్వం జాతీయ వైద్యుల దినోత్సవంగా 1991లో ప్రకటించింది. అప్పటి నుంచి మన దేశంలో ప్రతి ఏడాది జులై 1న నేషనల్ డాక్టర్స్ డేగా సెలబ్రేట్ చేసుకుంటున్నారు. ఈ సందర్భంగా వైద్యరంగంలో డాక్టర్ల నిస్వార్థ, అమూల్యమైన సేవలను గుర్తు చేసుకుంటుంటారు.

News July 1, 2024

మరో 24 గంటలు బార్బడోస్‌లోనే భారత జట్టు!

image

టీ20 వరల్డ్ కప్ ఫైనల్ జరిగిన బార్బడోస్‌ను మరో 6 గంటల్లో బెరిల్ హరికేన్(తుఫాన్) తాకనున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం అక్కడ కర్ఫ్యూ తరహా వాతావరణం నెలకొందని జాతీయ మీడియా ప్రతినిధులు తెలిపారు. వర్షం మొదలైందని, ఎయిర్ పోర్టు మూసివేయడంతో భారత జట్టు ఆటగాళ్లు హోటల్స్‌కే పరిమితమయ్యారని పేర్కొన్నారు. దీంతో మరో 24 గంటల వరకు అక్కడే ఉంటారని తెలుస్తోంది.