News September 30, 2024
ఏపీ ప్రభుత్వ తీరును ఆక్షేపించిన సుప్రీంకోర్టు

లడ్డూ వివాదంలో AP ప్రభుత్వం తీరును SC ఆక్షేపించింది. ‘ఈ వివాదంపై Sep 18న ముఖ్యమంత్రి ప్రకటన చేశారు. Sep 25న FIR నమోదైంది. Sep 26న సిట్ ఏర్పాటైంది. విచారణ పూర్తవ్వకముందే మనోభావాలు దెబ్బతీసేలా మీడియా ముందు ప్రకటన చేయాల్సిన అవసరం ఏముంది’ అని ప్రశ్నించింది. లడ్డూలు రుచిగా లేవని భక్తులు ఫిర్యాదు చేశారని TTD లాయర్ పేర్కొన్నారు. మరి ఆ లడ్డూలను పరీక్షలకు పంపారా? అంటూ కోర్టు నిలదీసింది.
Similar News
News October 26, 2025
భోజనం చేశాక ఈ శ్లోకం పఠిస్తే..?

రౌరవే పుణ్యనిలయే పద్మార్బుద నివాసినామ్ |
అర్థినాముదకం దత్తం అక్షయ్యముపతిష్ఠతు ||
భోజనం చేసిన తర్వాత ఈ శ్లోకం పఠిస్తే దానధర్మాలు చేసినంత పుణ్యం లభిస్తుందని పండితులు చెబుతున్నారు. మనం తినడానికి ముందు ఆకలి, దాహంతో ఉన్నవారిని గుర్తు చేసుకొని, కరుణతో కొన్ని మెతుకులు పక్కన పెట్టాలి. ఫలితంగా వారి ఆకలి తీరేలా సానుకూల శక్తులు తోడ్పడతాయని అంటున్నారు. వారి కోర్కెలు తీర్చిన పుణ్యం మనకు దక్కుతుందని నమ్మకం.
News October 26, 2025
అతివలకు తోడుగా ఈ టోల్‌ఫ్రీ నంబర్లు

బాలికలు, మహిళలపై జరుగుతున్న దాడులను అరికట్టి వారికి రక్షణ కల్పించేందుకు ప్రభుత్వాలు ప్రత్యేక టోల్‌ఫ్రీ నంబర్లు ఏర్పాటు చేశాయి. గృహహింస, లైంగిక వేధింపులు, ఆడపిల్లల అక్రమరవాణా నిరోధించేందుకు 181, బాల్యవివాహాలను నిరోధించేందుకు 1098, వేధింపుల నియంత్రణకు షీటీం, ప్రసూతి సేవలకు అంబులెన్స్ కోసం 102, అంగన్‌వాడీ హెల్ప్‌లైన్ కోసం 155209 నంబర్లను అత్యవసర సమయాల్లో సంప్రదించాలని నిపుణులు సూచిస్తున్నారు.
News October 26, 2025
బస్సు ప్రమాదం.. బైకును తొలగిస్తే 19 మంది బతికేవారు!

AP: కర్నూలు బస్సు ప్రమాదానికి ముందు మరో 3 బస్సులు రోడ్డుపై పడిపోయిన బైకును చూసి పక్క నుంచి వెళ్లాయి. కానీ ఆ <<18106434>>బైకును<<>> రోడ్డుపై నుంచి తొలగించే ప్రయత్నం చేయలేదు. అలా చేసి ఉంటే ఈ ఘోర ప్రమాదం తప్పేది. 19 మంది ప్రాణాలతో ఉండేవారు. డ్రైవర్ ఆ బైకుపై నుంచి బస్సును పోనిచ్చాడు. మంటలు చెలరేగగానే భయపడి అక్కడి నుంచి పారిపోయాడు. ప్రయాణికులకు సమాచారం ఇచ్చినా అందరూ బస్సు దిగి ప్రాణాలు రక్షించుకునేవారు.


