News July 12, 2024
‘హాథ్రస్’పై పిటిషన్ తిరస్కరించిన సుప్రీం కోర్టు

హాథ్రస్లో జరిగిన తొక్కిసలాటలో 121 మంది మరణించడంపై కమిటీ ఏర్పాటు చేసి ఎంక్వైరీ చేయించాలని దాఖలైన పిటిషన్ను సుప్రీం కోర్టు తిరస్కరించింది. ఇది ఆందోళన కలిగించే అంశమని CJI జస్టిస్ చంద్రచూడ్ నేతృత్వంలోని ధర్మాసనం పేర్కొంది. అయితే ఇటువంటి కేసులను హైకోర్టుల్లో పరిష్కరించడం మంచిదని, పిటిషనర్ అలహాబాద్ (యూపీ) కోర్టును ఆశ్రయించాలని సుప్రీం కోరింది.
Similar News
News January 29, 2026
టీమ్ఇండియా ఓటమి.. సూర్య ఏమన్నారంటే?

NZతో <<18988305>>4th T20లో<<>> కావాలనే ఆరుగురు బ్యాటర్లు, ఐదుగురు పర్ఫెక్ట్ బౌలర్లతో బరిలోకి దిగామని IND కెప్టెన్ సూర్య తెలిపారు. ‘మమ్మల్ని మేము ఛాలెంజ్ చేసుకున్నాం. ఫస్ట్ బ్యాటింగ్ చేసినప్పుడు బాగా ఆడుతున్నాం. ఛేజింగ్లో 2, 3 వికెట్లు త్వరగా పడితే ఎలా ఆడతారో చూడాలనుకున్నాం. నెక్స్ట్ మ్యాచులోనూ ఛేజింగ్ చేసే అవకాశం రావాలని కోరుకుంటున్నా. దూబేకి తోడుగా ఇంకో బ్యాటర్ ఉండుంటే ఫలితం వేరేలా ఉండేది’ అని పేర్కొన్నారు.
News January 29, 2026
జనవరి 29: చరిత్రలో ఈరోజు

1912: సుప్రీంకోర్టు 14వ ప్రధాన న్యాయమూర్తి అజిత్ నాథ్ రే జననం
1936: సినీ గేయ రచయిత వేటూరి సుందరరామ్మూర్తి జననం (ఫొటోలో)
1936: సినీ దర్శకుడు బైరిశెట్టి భాస్కరరావు జననం
1962: జర్నలిస్టు, ఉద్యమకారిణి గౌరీ లంకేష్ జననం
2003: నటి పండరీబాయి మరణం
* జాతీయ పజిల్ దినోత్సవం
News January 29, 2026
ఈ 4 పండ్లు తింటే టైప్-2 డయాబెటిస్ ముప్పు

సపోటాల్లోని విటమిన్ A, C, ఐరన్, పొటాషియం, కాల్షియం, ఫాస్పరస్, ఫైబర్, యాంటీఆక్సిడెంట్లు, ఫ్రక్టోజ్, సుక్రోజ్ రక్తంలో షుగర్ లెవెల్స్ను పెంచుతాయి. అరటిపండులో ఫ్రక్టోజ్, సుక్రోజ్ ఉన్నందున వారానికి 2-3 కంటే ఎక్కువ తీసుకోకూడదు. మామిడి పండ్లు, సీతాఫలం తిన్నా షుగర్ లెవెల్స్ పెరిగే ప్రమాదం ఉండడంతో రెగ్యులర్గా తినకూడదు. షుగర్ కంట్రోల్లో లేనివారు/ఇన్సులిన్ వాడతున్న వారు డాక్టర్ సలహా తీసుకోవాలి.


