News May 14, 2024
మోదీపై పిటిషన్.. తిరస్కరించిన సుప్రీం కోర్టు
ప్రధాని మోదీ ఈ ఎన్నికల్లో పాల్గొనకుండా అనర్హత వేటు వేయాలని దాఖలైన పిటిషన్‌ను సుప్రీం కోర్టు తోసిపుచ్చింది. ప్రధాని మోదీ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఇటీవల మతవిద్వేషాలు రెచ్చగొట్టేలా వ్యాఖ్యలు చేశారని ఓ పిటిషనర్ కోర్టును ఆశ్రయించారు. దీనిపై స్పందించిన సర్వోన్నత న్యాయస్థానం.. ఈ విషయంలో మొదట ఎన్నికల సంఘాన్ని సంప్రదించాలని ఆ పిటిషనర్‌కు సూచించింది. దీంతో సదరు వ్యక్తి పిటిషన్ వెనక్కి తీసుకున్నారు.
Similar News
News January 10, 2025
లేఔట్లపై ప్రభుత్వం కీలక నిర్ణయం
AP: భవన నిర్మాణాలు, లేఔట్ల అనుమతుల నిబంధనలు సులభతరం చేస్తూ ప్రభుత్వం GOలు తెచ్చింది. లేఔట్లలో రోడ్లను 12M బదులు 9Mలకు కుదిస్తూ, 500చ.మీ. పైబడిన స్థలాల్లోని నిర్మాణాల్లో సెల్లార్‌కు అనుమతి, TDR బాండ్ల జారీ కమిటీలో సబ్ రిజిస్ట్రార్లను తొలగిస్తూ నిర్ణయించింది. సంక్రాంతి కానుకగా బిల్డర్లు, డెవలపర్లు, ప్రజలకు అనుకూలంగా జీవోలు తెచ్చామని.. దీంతో రియల్ ఎస్టేట్ రంగం పుంజుకుంటుందని మంత్రి నారాయణ చెప్పారు.
News January 10, 2025
కాంగ్రెస్, BRS మధ్య ‘బ్లాక్ బ్యాగ్’ విమర్శలు!
TG: ‘పదేళ్ల నుంచి దుమ్ము పట్టిన ఒక నల్ల బ్యాగు ACB ఆఫీసులో ఉంది. ఈ బ్యాగ్ ఎవరిదో చెప్పుకోండి’ అంటూ BRS ట్వీట్ చేసింది. దీనిపై స్పందించిన T కాంగ్రెస్ ‘ఆ నల్ల బ్యాగులో 2014 నుంచి మీరు చేసిన పాపాల చిట్టా ఉంది. ఆ బ్యాగును చూసి తెల్లమొహం వేసుకున్నాడా KTR? BRS దోపిడీ దొంగల అవినీతి వివరాలను నింపడానికి ఆ బ్యాగు సరిపోదు. KTR విచారణకు వెళ్లిన ప్రతిసారి బ్యాగులను లెక్కించమని చెప్పండి’ అని కౌంటర్ ఇచ్చింది.
News January 10, 2025
లిక్కర్ కంపెనీలకు, ప్రభుత్వానికి సంబంధమేంటి?
TG: పెండింగ్ బిల్లులు చెల్లించకపోవడంతో UB కంపెనీ మద్యం సరఫరా నిలిపివేసిన విషయం తెలిసిందే. లిక్కర్ కంపెనీలు తమ బ్రాండ్లను నేరుగా దుకాణాలకు సరఫరా చేయలేవు. ప్రభుత్వ ఆధ్వర్యంలో నడిచే డిపోలకు మాత్రమే పంపాలి. డిపోల నుంచి రిటైల్ వ్యాపారులకు మద్యం చేరుతుంది. కంపెనీలు డబ్బుల కోసం పూర్తిగా ప్రభుత్వంపైనే ఆధారపడాలి. అటు వినియోగదారుడు కొనే బీరు ధరలో 16% తయారీ ఖర్చు ఉండగా 70% ప్రభుత్వ పన్నులే ఉంటాయి.