News December 2, 2024

పోలింగ్ స్టేషన్‌లో ఓటర్ల సంఖ్య పెంపుపై నేడు సుప్రీంలో విచారణ

image

ఒక్కో పోలింగ్ స్టేషన్‌లో ఓటర్ల గరిష్ఠ సంఖ్యను 1,200 నుంచి 1,500కు పెంచుతూ EC తీసుకున్న నిర్ణయంపై సుప్రీంలో పిల్ దాఖలైంది. దీనిపై CJI జస్టిస్ సంజీవ్ ఖన్నా ధర్మాసనం నేడు విచారించనుంది. EC నిర్ణయంతో క్యూలో వెయిటింగ్ టైమ్ పెరుగుతుందని, ప్రజలు ఓటింగ్‌కు దూరమవుతారని పిటిషనర్ పేర్కొన్నారు. EVMలో ఒక్క ఓటు వేయడానికి 60-90సెకన్ల సమయం పడుతుందని, దీని ప్రకారం 490 నుంచి 660 మందే ఓటు వేయగలుగుతారని చెప్పారు.

Similar News

News November 26, 2025

కొత్త జిల్లాలో పరిపాలనకు అంతా సిద్ధమేనా..?

image

మార్కాపురం సరికొత్త జిల్లాగా అవతరించనున్న నేపథ్యంలో జిల్లా పరిపాలనకు సంబంధించిన కార్యాలయాలపై విస్తృత చర్చ సాగుతోంది. జిల్లా అంటే కలెక్టర్, ఎస్పీ కార్యాలయంతోపాటు ఇతర శాఖల అధికారులకు అనువైన భవనాలు అవసరం. అయితే జిల్లా ఆమోదానికి ముందుగానే ప్రభుత్వం, నివేదికలను తెప్పించుకొని ఒక నిర్ణయానికి వచ్చినట్లు సమాచారం. ప్రస్తుత ప్రకాశం జిల్లా కలెక్టర్ రాజాబాబు సారథ్యంలోనే కొత్త జిల్లా కార్యాలయాల ఎంపిక సాగనుందట.

News November 26, 2025

నవంబర్ 26: చరిత్రలో ఈ రోజు

image

1921: వ్యాపారవేత్త, శ్వేత విప్లవ పితామహుడు వర్గీస్ కురియన్ జననం
1949: భారత రాజ్యాంగం ఆమోదం పొందింది
1997: సినీ నటుడు మందాడి ప్రభాకర రెడ్డి మరణం
2006: సినీ నటి జి.వరలక్ష్మి మరణం
2008: ముంబై ఉగ్ర దాడిలో 160 మందికిపైగా మృతి (ఫొటోలో)
* జాతీయ న్యాయ దినోత్సవం
* జాతీయ పాల దినోత్సవం

News November 26, 2025

అరుణాచల్ మాదే.. నిజాన్ని మార్చలేరు: భారత్

image

అరుణాచల్ తమ భూభాగమేనన్న చైనా <<18386250>>ప్రకటనను<<>> భారత విదేశాంగ శాఖ ప్రతినిధి రణధీర్ జైస్వాల్ ఖండించారు. ‘భారత్‌లో అరుణాచల్ అంతర్భాగం. ఇదే వాస్తవం. చైనా తిరస్కరించినా నిజం మారదు’ అని స్పష్టం చేశారు. షాంఘై ఎయిర్‌పోర్టులో భారత ప్రయాణికురాలిని అడ్డుకోవడాన్ని తప్పుబట్టారు. ఇంటర్నేషనల్ ఎయిర్ ట్రావెల్ రూల్స్‌, అన్ని దేశాల పౌరులకు 24hrs వీసా ఫ్రీ ట్రాన్సిట్ కల్పించే చైనా రూల్‌నూ అక్కడి అధికారులు పాటించలేదన్నారు.