News December 17, 2024
సుప్రీం లీడర్ అహం కోసమే కిరాతక జమిలి బిల్లు: అసదుద్దీన్ ఒవైసీ

కిరాతక జమిలి ఎన్నికల బిల్లును వ్యతిరేకిస్తున్నామని MIM అధినేత అసదుద్దీన్ ఒవైసీ అన్నారు. ఈ చట్టం అమల్లోకి వస్తే అసెంబ్లీల కాల వ్యవధి తగ్గిపోతుందన్నారు. ఇది రాజ్యాంగ మౌలిక నిర్మాణం, సమాఖ్య విధానానికి వ్యతిరేకమన్నారు. ‘ఈ బిల్లుతో పరోక్షంగా రాష్ట్రపతి తరహా పాలన వస్తుంది. ప్రాంతీయ పార్టీలు చచ్చిపోతాయి. సుప్రీం లీడర్ (మోదీ) అహాన్ని సంతృప్తి పరిచేందుకే దీనిని తీసుకొచ్చారు’ అని వివరించారు.
Similar News
News November 23, 2025
వేగంగా కోలుకుంటున్న శ్రేయస్

ఆసీస్‌తో ODI సిరీస్‌లో గాయపడిన శ్రేయస్ అయ్యర్ వేగంగా కోలుకుంటున్నారు. ఆయన ఆరోగ్యంపై PBKS కో ఓనర్ ప్రీతిజింటా అప్డేట్ ఇచ్చారు. ఆ జట్టు ప్లేయర్ శశాంక్ సింగ్ బర్త్‌డే పార్టీలో దిగిన ఫొటోలను ఇన్‌స్టాలో షేర్ చేశారు. శ్రేయస్ అద్భుతంగా రికవరీ అవుతూ బయటకు రావడం సంతోషంగా ఉందన్నారు. కాగా SAతో ODI సిరీస్‌కు అతను ఇప్పటికే దూరమయ్యారు. జనవరిలో NZతో జరిగే వన్డేలకు అందుబాటులోకి రావాలని అభిమానులు కోరుకుంటున్నారు.
News November 23, 2025
సీట్స్ ఫుల్.. టికెట్స్ నిల్! తప్పదు చిల్లు..!!

AP: సంక్రాంతికి ఊరికి వెళ్దాం అనుకున్న వారికి ఈసారీ అధిక చెల్లింపు చిల్లు తప్పదేమో. పెద్ద పండుగకు ఏపీలోని ప్రధాన నగరాలు, పట్టణాలకు వెళ్లే రైళ్లు, విమానాల్లో టికెట్స్ బుక్ అయ్యాయి. రెండు నెలల ముందే సీట్స్ నిండి వెయిటింగ్ లిస్ట్ వందల్లో కన్పిస్తోంది. దీంతో ప్రైవేటు ట్రావెల్స్ బుకింగ్స్ రేట్స్ ఇప్పట్నుంచే పెంచేస్తున్నాయి. ఇంకేముంది.. ఎప్పట్లాగే ఈసారీ ప్రైవేటును ఆశ్రయించి ఛార్జీ వేటుకు గురవక తప్పదు.
News November 23, 2025
పర్సనల్ లైఫ్ తప్ప పైరసీపై నోరుమెదపని iBOMMA రవి?

iBOMMA నిర్వాహకుడు రవి నాలుగో రోజు విచారణలో తన లైఫ్‌స్టైల్ గురించి పలు విషయాలు వెల్లడించినట్లు సమాచారం. ‘పైరసీతో వచ్చిన డబ్బులను ఎప్పటికప్పుడు ఖర్చు చేశా. 15-20 రోజులకొకసారి విదేశాలకు వెళ్లాను. నెదర్లాండ్స్, స్విట్జర్లాండ్, US, ఫ్రాన్స్, థాయ్‌లాండ్, దుబాయ్ తదితర దేశాలు తిరిగాను’ అని చెప్పినట్లు తెలుస్తోంది. పర్సనల్ విషయాలు తప్ప పైరసీ నెట్‌వర్క్ గురించి నోరు తెరవలేదని విశ్వసనీయ వర్గాల సమాచారం.


