News May 19, 2024

భారీ బందోబస్తు మధ్య కొనసాగుతున్న సర్వే

image

TG: మేడ్చల్ సుచిత్ర పరిధిలోని సర్వే నం.82లో వివాదాస్పద భూమిలో సర్వే కొనసాగుతోంది. ఈ భూమి తమదేనంటూ నిన్న 15 మంది వ్యక్తులు ఘటనాస్థలికి రాగా.. మాజీ మంత్రి మల్లారెడ్డి, రాజశేఖర్ రెడ్డి కూడా వాగ్వాదానికి దిగారు. దీంతో ఎలాంటి ఘటనలు జరగకుండా ముందు జాగ్రత్తగా భారీ బందోబస్తు మధ్య అధికారులు సర్వే నిర్వహిస్తున్నారు.

Similar News

News December 15, 2025

మాంసాహారం తిని గుడికి వెళ్లవచ్చా?

image

మాంసం తిని గుడికి వెళ్లడం శ్రేయస్కరం కాదని పండితులు చెబుతున్నారు. అందులో ఉండే తమో, రజో గుణాలు మనలో నిగ్రహాన్ని కోల్పోయేలా చేస్తాయని, తద్వారా పూజా ఫలితం దక్కదని అంటున్నారు. అందుకే గుడికి వెళ్లేటప్పుడు, దైవ కార్యాలు చేసేటప్పుడు కనీసం గుడ్లు కూడా ముట్టుకోవద్దంటున్నారు. అయితే సంపూర్ణ పూజా ఫలం దక్కాలంటే.. ఉల్లి, వెల్లుల్లి, మసాలా దినుసులు లేని ఆహారాన్నే స్వీకరించాలని సూచిస్తున్నారు.

News December 15, 2025

CSIR-UGC NET అడ్మిట్ కార్డులు విడుదల.. డౌన్లోడ్ చేసుకోండి

image

<>నేషనల్<<>> టెస్టింగ్ ఏజెన్సీ CSIR-UGC NET డిసెంబర్- 2025 అడ్మిట్ కార్డులు విడుదల చేసింది. అభ్యర్థులు అప్లికేషన్ నంబర్, పాస్‌వర్డ్, సెక్యూరిటీ పిన్ ఎంటర్ చేసి డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. డిసెంబర్ 18న రెండు షిఫ్ట్‌ల్లో(CBT) పరీక్ష నిర్వహించనున్నారు. ఈ పరీక్షలో అర్హత సాధించడం ద్వారా పరిశోధనలు చేసే ఛాన్స్ లభిస్తుంది. JRF, అసిస్టెంట్ ప్రొఫెసర్ నియామకం, PhDలో ప్రవేశం పొందవచ్చు. వెబ్‌సైట్: csirnet.nta.nic.in/

News December 15, 2025

IPL మాక్ వేలం.. గ్రీన్‌కు రూ.30.50 కోట్లు!

image

స్టార్ స్పోర్ట్స్ ఛానెల్ నిర్వహించిన IPL మాక్ వేలంలో ఆస్ట్రేలియా ఆల్‌రౌండర్ కామెరూన్ గ్రీన్ కళ్లుచెదిరే ధర పలికారు. KKRకు ప్రాతినిధ్యం వహించిన రాబిన్ ఉతప్ప అతడిని రూ.30.50 కోట్లకు కొనుగోలు చేశారు. ఆ తర్వాత లివింగ్‌స్టోన్‌ను లక్నో రూ.19 కోట్లకు, మతీశా పతిరణను KKR రూ.13 కోట్లకు దక్కించుకున్నాయి. కాగా రేపు ఐపీఎల్ మినీ వేలం అబుదాబిలో జరగనుంది. మరి ఏ ప్లేయర్ ఎక్కువ ధర పలుకుతారో కామెంట్ చేయండి.