News April 24, 2024
దేశంలో ఎత్తైన హనుమాన్ విగ్రహమిదే!

దేశంలోనే అతిపెద్ద ఆంజనేయస్వామి విగ్రహం ఏపీలో ఉంది. శ్రీకాకుళం జిల్లా మడపంలో 176 అడుగుల ఎత్తైన విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. ఈ హనుమాన్ విగ్రహ నిర్మాణానికి సుమారు రూ.కోటి ఖర్చు చేశారు. బిదనగెరె (కర్ణాటక) 161 అడుగులు, పరిటాల (ఏపీ) 135, ఒడిశాలోని దమంజోడి హనుమాన్ 108.9, సిమ్లాలోని జాఖూ హిల్ హనుమాన్ 108, ఢిల్లీలోని శ్రీ సంకట్ మోచన్ హునుమాన్ 108 అడుగులతో తర్వాతి స్థానాల్లో ఉన్నాయి.
Similar News
News January 7, 2026
మున్సిపల్ ఎన్నికలపై SEC సన్నాహాలు

TG: మున్సిపల్ ఎన్నికలపై స్టేట్ ఎలక్షన్ కమిషనర్ కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఎన్నికల ముందస్తు ఏర్పాట్లకు ఆదేశాలిచ్చారు. ‘JAN 12న వార్డుల వారీ ఓటర్ల తుది జాబితాను ప్రచురించాలి. 13న పోలింగ్ కేంద్రాల జాబితాను ‘T పోల్’లో పొందుపర్చాలి. 16న పోలింగ్ కేంద్రాల వారీగా ఫొటోలతో కూడిన ఓటర్ల తుది జాబితాను విడుదల చేయాలి’ అని ఆదేశించారు. బ్యాలెట్ బాక్సులు, సిబ్బంది నియామకాన్ని ముమ్మరం చేయాలన్నారు.
News January 7, 2026
కేంద్ర మాజీ మంత్రి కన్నుమూత

బీజేపీ సీనియర్ నేత, కేంద్ర మాజీ మంత్రి కబీంద్ర పుర్కాయస్థ(94) కన్నుమూశారు. అనారోగ్య సమస్యలతో సిల్చార్ (అస్సాం)లోని ఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. 1931లో జన్మించిన ఈయన 1991, 98, 2009లో లోక్సభ ఎంపీగా గెలిచారు. బీజేపీ ఏర్పాటులో కీలక పాత్ర పోషించారు. వాజ్పేయి హయాంలో కేంద్ర కమ్యూనికేషన్ శాఖ మంత్రిగా పని చేశారు. కబీంద్ర మరణం పట్ల ప్రధాని మోదీ సంతాపం వ్యక్తం చేస్తూ ట్వీట్ చేశారు.
News January 7, 2026
అక్కడ బీజేపీ-MIM పొత్తు

అంబర్నాథ్(MH)లో BJP, కాంగ్రెస్ <<18786772>>పొత్తు<<>> దుమారం రేపగా, అకోలాలో BJP-MIM కలిసిపోవడం చర్చనీయాంశమవుతోంది. అకోలా మున్సిపల్ కౌన్సిల్లో 33 సీట్లకు ఎన్నికలు జరగ్గా BJP 11, కాంగ్రెస్ 6, MIM 5, మిగతా పార్టీలు 11 చోట్ల గెలిచాయి. ఈ క్రమంలో MIM, ఇతర పార్టీలతో కలిసి కూటమిని BJP స్థానిక యూనిట్ ఏర్పాటు చేసింది. మున్సిపాలిటీని కైవసం చేసుకుంది. అయితే MIMతో పొత్తును అంగీకరించబోమని CM ఫడణవీస్ స్పష్టం చేశారు.


