News April 6, 2024

ఏటా కనీసం $100 బిలియన్లు రాబట్టడమే టార్గెట్!

image

FDI కింద ఏటా $100 బిలియన్లకుపైగా పెట్టుబడులను రాబట్టాలని భారత్ ఆశిస్తున్నట్లు కేంద్ర వర్గాలు వెల్లడించాయి. మరో ఐదేళ్లలో ఈ టార్గెట్ చేరుకుంటామని ధీమా వ్యక్తం చేశాయి. కాగా FY22లో గరిష్ఠంగా $80 బిలియన్లకుపైగా చేరిన FDI సగటు ఆ తర్వాత క్రమంగా తగ్గిపోయింది. చైనాకు దీటుగా ప్రత్యామ్నాయంగా మార్చుకుని, ఆ దేశానికి తరలివెళ్లే పెట్టుబడులను ఇటువైపుకు తిప్పుకునేందుకు భారత్ ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది.

Similar News

News December 20, 2025

ఈ జిల్లాలకు ఎల్లో అలర్ట్

image

TG: రాష్ట్రంలో ఈ నెల 23 వరకు పలుజిల్లాల్లో శీతల గాలులు వీస్తాయని భారత వాతావరణ కేంద్రం తెలిపింది. రేపు ఉదయం 8.30 గంటల వరకు ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, వరంగల్, హనుమకొండ, జనగామ, సిద్దిపేట, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి జిల్లాల్లో చలిగాలులు వీస్తాయని ఎల్లో అలర్ట్ జారీ చేసింది. పలు చోట్ల ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 4-5 డిగ్రీలు తక్కువగా నమోదవుతాయని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది.

News December 20, 2025

జగన్‌ది రాక్షసత్వం: CM CBN

image

AP: యోగా డే నిర్వహణపై జగన్ వ్యాఖ్యల పట్ల CBN పరోక్షంగా స్పందించారు. ‘రంగురాళ్లపై బొమ్మలకోసం ₹700CR, రుషికొండకు గుండు కొట్టి ప్యాలెస్ కోసం ₹500 CR దుర్వినియోగం చేశారు. ప్రజారోగ్యం కోసం యోగా డే నిర్వహిస్తే విష ప్రచారం చేస్తున్నారు. PPPలో కాలేజీలు కడుతుంటే జైల్లో పెడతామంటున్నారు. ఇది వారి రాక్షసత్వానికి నిదర్శనం’ అని మండిపడ్డారు. అభివృద్ధికి అడ్డుపడుతున్నారని, అయినా వెనక్కు తగ్గేదే లేదని చెప్పారు.

News December 20, 2025

సౌత్ కొరియాను వేధిస్తున్న బట్టతల సమస్య

image

సౌత్ కొరియాలో బట్టతల ఓ సమస్యగా మారింది. గతేడాది 2.40 లక్షల మంది జుట్టు రాలుతోందని ఆసుపత్రులను ఆశ్రయిస్తే వారిలో 40% యువతే ఉండటం గమనార్హం. కాగా దీని వైద్య ఖర్చులను ప్రభుత్వం భరిస్తుందన్న అధ్యక్షుడు లీ సూచన వివాదంగా మారింది. తీవ్రమైన వ్యాధ్యులను వదిలి దీనికి నిధులు వెచ్చించడమేమిటని పలువురు ప్రశ్నిస్తున్నారు. అయితే బట్టతలతో యువత ఆత్మస్థైర్యం సన్నగిల్లుతోందని, ఇది ప్రగతికి సమస్య అంటున్న వారూ ఉన్నారు.