News October 8, 2024
అప్పటి కింగ్ మేకర్ ఇప్పుడు జీరో

2019 హరియాణా ఎన్నికల్లో కింగ్ మేకర్‌గా నిలిచిన JJP ఈ ఎన్నికల్లో కనీసం ప్రభావం చూపలేకపోయింది. దుశ్యంత్ చౌతాలా సారథ్యంలోని ఈ స్థానిక పార్టీ జాట్ వర్గాల అండతో గత ఎన్నికల్లో 14.80% ఓట్లతో 10 సీట్లు గెల్చుకొని BJP ప్రభుత్వ ఏర్పాటులో కీలకపాత్ర పోషించింది. దుశ్యంత్‌ను DyCM పదవి వరించింది. అయితే ఈ ఎన్నికల్లో ఒక్క సీటూ గెలవలేదు. ఉచన కలన్‌లో దుశ్యంత్ 5వ స్థానానికి పరిమితమయ్యారు.
Similar News
News November 17, 2025
ఢిల్లీ పేలుడు: ఏమిటీ డెడ్ డ్రాప్?

ఢిల్లీ పేలుడు కేసు నిందితులు ‘డెడ్ డ్రాప్’ ఈ-మెయిల్ విధానం వాడినట్లు దర్యాప్తు అధికారులు భావిస్తున్నారు. ఒకే మెయిల్ IDతో రహస్యంగా సమాచార మార్పిడి చేసుకోవడమే ‘డెడ్-డ్రాప్’ పద్ధతి. సమాచారాన్ని డ్రాఫ్ట్‌లో సేవ్ చేస్తే, దాన్ని అవతలి వ్యక్తి చూస్తారు. తర్వాత అప్డేట్ లేదా డిలీట్ చేస్తారు. ఇందులో మెయిల్ పంపడం, రిసీవ్ చేసుకోవడమనేదే ఉండదు. దీన్ని గుర్తించడం చాలా కష్టమని అధికారులు అంటున్నారు.
News November 17, 2025
తెలంగాణ న్యూస్ అప్డేట్స్

*CM రేవంత్ రెడ్డి అధ్యక్షతన సోమవారం రాష్ట్ర క్యాబినెట్ భేటీ కానుంది. స్థానిక ఎన్నికల నిర్వహణపై నిర్ణయం తీసుకునే అవకాశం.
*కాంగ్రెస్, ప్రభుత్వంలో నేతల పనితీరు ఆధారంగా ప్రక్షాళన చేయాలని AICC కార్యదర్శి సంపత్ కుమార్ అన్నారు. కొన్ని కలుపు, గంజాయి మొక్కలు ఉన్నాయని, వాటిని ఏరిపారేయాలని చెప్పారు.
* యాదగిరి గుట్టకు లక్షమందికి పైగా భక్తుల రాక. ఒక్క రోజే రూ.కోటికి పైగా ఆదాయం వచ్చినట్లు అధికారుల వెల్లడి.
News November 17, 2025
ఏపీ న్యూస్ అప్డేట్స్

*ఉత్పత్తిని బట్టి జీతం ఇస్తామని వైజాగ్ స్టీల్ ప్లాంట్ యాజమాన్యం సర్క్యులర్ జారీ చేయడంపై ఉద్యోగ సంఘాల ఆగ్రహం. సర్క్యులర్‌ను విత్ డ్రా చేసుకోవాలని డిమాండ్.
* చంద్రబాబు ఫ్రస్ట్రేషన్ చూస్తుంటే స్టీల్ ప్లాంట్‌ను ఏదో ఒకటి చేసేలా ఉన్నారని మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ అన్నారు.
* ఇక నుంచి పాలిటిక్స్‌లో యాక్టివ్ అవుతానని వంగవీటి రంగా కూతురు ఆశ కిరణ్ ప్రకటన. ఏ పార్టీలో చేరాలో ఇంకా నిర్ణయించుకోలేదని వెల్లడి.


