News January 19, 2025
అది సైఫ్ నివాసమని దొంగకు తెలియదు: అజిత్

సైఫ్ అలీ ఖాన్‌పై దాడి నేపథ్యంలో ముంబైలో శాంతి భద్రతలు క్షీణించాయంటూ విపక్షాలు చేస్తున్న విమర్శలను డిప్యూటీ సీఎం అజిత్ పవార్ ఖండించారు. ప్రభుత్వంపై బురదజల్లే ప్రయత్నాలు మానుకోవాలని హితవు పలికారు. నిందితుడికి అది సెలబ్రిటీ నివాసమని తెలియదని, దొంగతనం కోసమే వెళ్లాడని తెలిపారు. అతడు బంగ్లాదేశ్ నుంచి కోల్‌కతాకు వచ్చి తర్వాత ముంబైకి మకాం మార్చాడన్నారు. కాగా నిందితుడిని అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే.
Similar News
News October 20, 2025
రాష్ట్రంలో తగ్గిన నూనె గింజ పంటల సాగు విస్తీర్ణం

AP: రాష్ట్రంలో ఈ ఏడాది నూనెగింజ పంటల సాగు విస్తీర్ణం తగ్గింది. ఈ ఏడాది 17 లక్షల ఎకరాల్లో నూనెగింజల పంటలను సాగుచేయాలనుకోగా 6.50 లక్షల ఎకరాల్లో మాత్రమే వేరుశనగతో పాటు ఇతర నూనెగింజల పంటలు సాగయ్యాయి. వరి 38.97 లక్షల ఎకరాల్లో సాగు చేస్తున్నారు. పత్తి 11 లక్షల ఎకరాల్లో, చెరకు 30 వేల ఎకరాలకే పరిమితమైంది. మొక్క జొన్న, సజ్జ, చిరుధాన్యాలు, కందులు, ఆముదం, జూట్ వంటి పంటలు లక్ష్యానికి మించి సాగయ్యాయి.
News October 20, 2025
సత్యభామలా ఆత్మస్థైర్యంతో ఉందాం..

నరకాసురుడితో యుద్ధం చేసి చంపడంలో శ్రీకృష్ణుడికి సత్యభామ సహకరిస్తుంది. మనలోని నిరాశ, అలసత్వం, పిరికితనం వంటి బలహీనతలను నరకసారుడిగా భావించి ధైర్యం, అప్రమత్తత, తెగింపు, ఆత్మస్థైర్యం, చురుకుదనంతో అతివలు పోరాడాలి. ఎక్కడ ప్రేమను చూపాలో, ఎక్కడ విజృంభించాలో తెలిసిన శక్తిస్వరూపుణి సత్యభామ. నేటితరం యువతులు ఆ గుణాలను ఆకళింపు చేసుకుంటే జయం ఎప్పుడూ మీ వెంటే ఉంటుంది.
* స్త్రీమూర్తులందరికీ దీపావళి శుభాకాంక్షలు.
News October 20, 2025
మేకప్ తీయడానికి ఈ జాగ్రత్తలు

మేకప్ వేసుకోవడంలోనే కాదు దాన్ని తీసే విషయంలోనూ కొన్ని జాగ్రత్తలు పాటించాలంటున్నారు నిపుణులు. లేదంటే ముఖ చర్మం దెబ్బతింటుంది. మేకప్ తీసేటపుడు ముఖాన్ని గట్టిగా రుద్దకూడదు. కాటన్ ప్యాడ్‌పై మేకప్ రిమూవర్ వేసి ముఖానికి అద్ది కాసేపటి తర్వాత క్లీన్ చెయ్యాలి. కళ్ల చివర్లు, పెదాలు, మెడ, చెవులు, హెయిర్‌లైన్ ప్రాంతాల్లోనూ మేకప్ తియ్యాలి. కుదిరితే ముఖానికి ఆవిరి పట్టి ఫేస్ క్లీన్ చేసుకుంటే సరిపోతుంది.