News November 26, 2024
పుష్ప-2కు మూడో మ్యూజిక్ డైరెక్టర్?

పుష్ప-2 ప్రాజెక్టులోకి ముచ్చటగా మూడో సంగీత దర్శకుడు ఎంట్రీ ఇచ్చినట్లు తెలుస్తోంది. ఖైదీ, క, డిమోంటీ కాలనీ-2 తదితర చిత్రాలకు పనిచేసిన శామ్ CS పుష్పలోని ఓ ఫైట్ సీక్వెన్స్కు BGM అందిస్తున్నట్లు సమాచారం. అల్లు అర్జున్ జాతర గెటప్ను ఆయన ఇవాళ సోషల్ మీడియాలో పోస్టు చేయడంతో ఆ వార్తలు నిజమేనని అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు. DSPతో పాటు తాను BGM అందిస్తున్నట్లు తమన్ ఇటీవల ప్రకటించిన విషయం తెలిసిందే.
Similar News
News December 7, 2025
చెప్పులు మెడలో వేసుకుని రాజీనామా చేస్తా: సర్పంచ్ అభ్యర్థి

TG: ఇచ్చిన హామీలు నెరవేర్చకపోతే కులానికి ఒక చెప్పు చొప్పున మెడలో వేసుకుని రాజీనామా చేస్తానని ఓ సర్పంచ్ అభ్యర్థి బాండ్ రాసివ్వడం చర్చనీయాంశమైంది. కరీంనగర్(D) చెంజర్ల గ్రామంలో రాజేశ్వరి అనే మహిళ ఎన్నికల బరిలో నిలిచారు. తనను గెలిపిస్తే 12పడకల ఆస్పత్రి, మినీ ఫంక్షన్ హాల్, ఓపెన్ జిమ్ ఏర్పాటుతో పాటు కోతుల సమస్యను పరిష్కరిస్తానని బాండుపై రాసిచ్చారు. 3ఏళ్లలో వీటిని పూర్తిచేయకపోతే రాజీనామా చేస్తానన్నారు.
News December 7, 2025
ఆరోగ్యం గురించి చెప్పే మొటిమలు

ముఖంపై వచ్చే మొటిమలను బట్టి ఆరోగ్యం ఎలా ఉందో చెప్పొచ్చంటున్నారు నిపుణులు. కనుబొమ్మల మధ్య తరచూ మొటిమలు వస్తుంటే లివర్ సమస్యలు ఉన్నట్లు, నుదుటిమీద వస్తుంటే జీర్ణ సమస్యలు, ముక్కు చుట్టూ వస్తుంటే గుండె సమస్యలు, గడ్డం భాగంలో వస్తుంటే హార్మోన్ల అసమతుల్యత, చెవుల చుట్టూ వస్తుంటే కిడ్నీ రిలేటెడ్ సమస్యలు ప్రారంభమై ఉండవచ్చని నిపుణులు చెబుతున్నారు. కాబట్టి మొటిమలనూ పట్టించుకోవాలని సూచిస్తున్నారు.
News December 7, 2025
గోవాకు వెళ్తున్నారా? జాగ్రత్త

2023లో HYD యువతి (30) పెళ్లికి ముందు ప్రియుడితో కలిసి గోవాకు వెళ్లింది. అక్కడ బస ఏర్పాట్లు చేసిన యశ్వంత్ అనే వ్యక్తి తాజాగా తనకు ఫోన్ చేసి బెదిరిస్తున్నాడని ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసింది. ప్రియుడితో గడిపిన వీడియోలను రికార్డు చేశానని, రూ.30 లక్షలు ఇవ్వకుంటే బయటపెడతానని బెదిరిస్తున్నాడని పేర్కొంది. తనకు వేరే వ్యక్తితో పెళ్లి అయిందని చెప్పినా వినట్లేదని వాపోయింది. దీంతో పోలీసులు కేసు నమోదు చేశారు.


