News December 13, 2024

రేపటి నుంచే మూడో టెస్ట్.. షెడ్యూల్ ఇదే

image

భారత్, ఆస్ట్రేలియా మధ్య రేపటి నుంచి గబ్బాలో BGT మూడో టెస్ట్ జరగనుంది. 5.50am-7.50am ఫస్ట్ సెషన్, 8.30am-10.30am సెకండ్ సెషన్, 10.50am-12.50 pm థర్డ్ సెషన్ జరుగుతుంది. భారత జట్టులో హర్షిత్ రాణా స్థానంలో ఆకాశ్ దీప్, అశ్విన్ ప్లేస్‌లో సుందర్ ఆడే ఛాన్సుంది. రోహిత్ శర్మ ఓపెనింగ్ చేసే అవకాశాలున్నాయి. అటు AUSలో బొలాండ్ స్థానంలో హెజిల్‌వుడ్ ఆడనున్నారు. స్టార్ స్పోర్ట్స్, హాట్‌స్టార్‌లో లైవ్ చూడవచ్చు .

Similar News

News December 11, 2025

12వ తరగతి వరకు ఒకే బోర్డు!

image

TG: పాఠశాల విద్యలో సమూల సంస్కరణలకు ప్రభుత్వం నిర్ణయించింది. SSC, ఇంటర్ బోర్డులను ఏకంచేసి 1-12వ తరగతి వరకు ‘స్కూల్ ఎడ్యుకేషన్ బోర్డ్’ (TGSEB)ను ఏర్పాటు చేయనుంది. ప్రైమరీ, సెకండరీ, హయ్యర్ సెకండరీ స్కూళ్లన్నీ దీని పరిధిలో చేరుతాయి. ఇక GOVT, AIDED, PVT, రెసిడెన్షియల్ స్కూళ్లలో విద్యానాణ్యత పర్యవేక్షణకు ‘స్కూల్ స్టాండర్డ్స్ అథారిటీ’ (TGSSA)ని పెట్టనుంది. TG రైజింగ్ డాక్యుమెంట్లో వీటిని పొందుపరిచింది.

News December 11, 2025

తీపి వస్తువులు పూర్తిగా మానేస్తున్నారా?

image

షుగర్ వస్తుందనే భయంతో చాలామంది తీపి పదార్థాలను పూర్తిగా మానేస్తున్నారు. అయితే అప్పుడప్పుడు తింటే ఇబ్బంది లేదని, అది కూడా తక్కువగా తీసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు. ‘చక్కెర అధికంగా తీసుకుంటే ఊబకాయం, షుగర్, గుండె జబ్బుల ప్రమాదం పెరుగుతుంది. ఆరోగ్యకరమైన ఆహారంతో సమతుల్యం చేసుకుని అప్పుడప్పుడు (వారానికి ఒకసారి) స్వీట్స్ తింటే హాని కలగదు’ అని పేర్కొన్నారు. SHARE IT

News December 11, 2025

థాయ్‌లాండ్‌లో పట్టుబడిన లూథ్రా బ్రదర్స్‌

image

గోవా నైట్‌క్లబ్ <<18509860>>ప్రమాదం<<>>లో కీలక నిందితులు గౌరవ్, సౌరభ్ లూథ్రా థాయ్‌లాండ్‌లో పట్టుబడ్డారు. డిసెంబర్‌ 7న రాత్రి క్లబ్‌లో మంటలు చెలరేగి 25 మంది మృతిచెందిన విషయం తెలిసిందే. అయితే ఘటన జరిగిన కొన్ని గంటల్లోనే వీరిద్దరూ పరారయ్యారు. నిబంధనల ఉల్లంఘనే ప్రమాదానికి కారణంగా పోలీసులు తేల్చారు. ఇప్పటికే ఈ కేసులో నలుగురిని అరెస్ట్ చేశారు. త్వరలో లూథ్రా బ్రదర్స్‌నూ భారత్‌కు తీసుకురానున్నారు.