News August 7, 2024
‘నాట్ ఔట్’కి బదులు ‘ఔట్’ ఇచ్చిన థర్డ్ అంపైర్

ఇండియా VS శ్రీలంక మూడో వన్డేలో ఆసక్తికర విషయం జరిగింది. 49వ ఓవర్లో కుల్దీప్ యాదవ్ వేసిన బంతికి మహీశ్ తీక్షణ ముందుకెళ్లి షాట్ కొట్టేందుకు ప్రయత్నించగా మిస్ అయింది. దీంతో WK రిషభ్ స్టంపింగ్ చేయగా అప్పటికే తీక్షణ బ్యాట్ను గ్రీస్లోపల ఉంచారు. కానీ, థర్డ్ అంపైర్ ‘ఔట్’ అని ప్రకటించడంతో శ్రీలంక కోచ్తో సహా అంతా షాక్ అవగా వెంటనే ‘నాట్ ఔట్’ అని మార్చారు. అయితే తీక్షణ బౌలింగ్లో పంత్ స్టంప్ ఔట్ అయ్యారు.
Similar News
News January 31, 2026
న్యూస్పేస్ ఇండియా లిమిటెడ్లో ఉద్యోగాలకు అప్లై చేశారా?

న్యూస్పేస్ ఇండియా లిమిటెడ్(<
News January 31, 2026
శనివారం రోజున శ్రీవారి పూజ ఎలా చేయాలి?

ఉదయాన్నే స్నానమాచరించి, నుదుట తిరునామం ధరించాలి. పూజగదిని రంగవల్లికలు, పుష్పాలతో అలంకరించి వేంకటేశ్వర స్వామిని శ్రీహరిగా భావించాలి. స్వామికి తులసి దళాలతో అర్చన చేసి, పాలు, పండ్లు లేదా చక్కెర పొంగలిని నైవేద్యంగా సమర్పించాలి. ఉదయం, సాయంత్రం ధూపదీపాలతో స్వామిని కొలవాలి. ఈ రోజు శ్రీనివాసుని కథా పారాయణం చేయడం వల్ల పనుల్లో జాప్యాలు తొలగి, గోవిందుడి కృపాకటాక్షాలు లభిస్తాయని భక్తుల ప్రగాఢ నమ్మకం.
News January 31, 2026
కోళ్లలో కొక్కెర వ్యాధి లక్షణాలు

కొళ్లలో కొక్కెర వ్యాధి చాలా ప్రమాదకరమైనది. దీన్ని రాణిఖేత్ డిసీజ్ అని కూడా అంటారు. ఇది సోకిన కోడి ముక్కు నుంచి చిక్కని ద్రవం కారుతుంది. పచ్చటి, తెల్లటి నీళ్ల విరేచనాలు అవుతాయి. కాళ్లు, మెడ, రెక్కల్లో పక్షవాతం, మెడ వంకర్లు తిరిగి, రెక్కలు, ఈకలు ఊడిపోతాయి. శ్వాస సమయంలో శబ్దం వస్తుంది. తోలు గుడ్లు పెడతాయి. వ్యాధి తీవ్రమైతే పల్టీలు కొడుతూ వ్యాధి సోకిన 3 నుంచి 4 రోజుల్లో కోళ్లు మరణిస్తాయి.


