News February 5, 2025

మేం ముగ్గురం మిత్రులమే: గిల్

image

ఇండియా తరపున ఆడుతున్నప్పుడు ఎవరు బాగా ఆడినా అభినందించాలని భారత క్రికెటర్ శుభ్‌‌మన్ గిల్ అన్నారు. అభిషేక్ తన బాల్య మిత్రుడని, జైస్వాల్ సైతం మంచి స్నేహితుడని తెలిపారు. మా ముగ్గురి మధ్య ఎటువంటి పోటీతత్వం ఉండదని అన్నారు. ఇండియా కోసం ఆడేటప్పుడు ప్రతి మ్యాచ్ బాగా ఆడేలా ప్రయత్నించాలన్నారు. అంతేగాని ఒకరు బాగా ఆడకూడదని కోరుకోవటం సరికాదని శుభమన్ పేర్కొన్నారు.

Similar News

News December 4, 2025

కోతులు ఏ శాఖ పరిధిలోకి వస్తాయి?: MP

image

TG: కోతుల సమస్యతో రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని లోక్ సభలో BJP MP విశ్వేశ్వర్ రెడ్డి తెలిపారు. తమ పరిధిలోకి రాదంటూ శాఖలు తప్పించుకుంటున్నాయని విమర్శించారు. ‘ఇది చిన్న విషయంగా నవ్వుతారు కానీ అన్ని రాష్ట్రాల్లోనూ ఉన్న పెద్ద సమస్య. సర్పంచి ఎన్నికల్లో ఇది ఓ అజెండాగా మారింది. సమస్య పరిష్కరిస్తే సర్పంచిగా గెలిపిస్తామని జనం అంటున్నారు. కోతులు ఏ శాఖ కిందికి వస్తాయో వెల్లడించాలి’ అని కోరారు.

News December 4, 2025

నేవీలో తొలి మహిళా ఫైటర్ పైలట్‌ ఆస్తా పూనియా

image

భారత నౌకాదళంలో మొట్ట మొదటి మహిళా ఫైటర్‌ పైలట్‌గా చరిత్ర సృష్టించారు ఆస్తా పూనియా. ప్రతిష్ఠాత్మకమైన ‘వింగ్స్‌ ఆఫ్‌ గోల్డ్‌’ పురస్కారాన్ని అందుకున్నారు. ఉత్తర్‌ప్రదేశ్‌లోని మేరర్‌కు చెందిన ఆస్తా ఇంజినీరింగ్‌ చేశారు. నేవీ యుద్ధవిమానాన్ని నడపడం ఆషామాషీ విషయం కాదు. ఎన్నో సవాళ్లను అధిగమిస్తూ ఫైటర్‌ స్ట్రీమ్‌లో అడుగుపెట్టిన తొలి మహిళగా ప్రత్యేకత చాటుకున్నారామె. ఎంతోమంది యువతులకు రోల్‌మోడల్‌గా నిలిచింది.

News December 4, 2025

డిగ్రీ లేకపోయినా ఉద్యోగమిస్తా: జోహో CEO

image

జోహో సీఈవో శ్రీధర్ వెంబు సూపర్ ఆఫర్ ఇచ్చారు. నైపుణ్యం ఉంటే చాలని.. డిగ్రీ లేకుండానే ఉద్యోగం ఇస్తానని ప్రకటించారు. పిల్లలపై ఒత్తిడి పెట్టడం మానాలని భారతీయ తల్లిదండ్రులకు విజ్ఞప్తి చేశారు. అమెరికాలో యువత డిగ్రీ వదిలి నేరుగా ఉద్యోగాలను ఎంచుకుంటున్న ధోరణిని ఉదాహరణగా చూపించారు. Zohoలో ఏ ఉద్యోగానికీ డిగ్రీ క్రైటీరియా లేదని తెలిపారు. తనతో పనిచేస్తున్న టీమ్‌లో సగటు వయస్సు 19 ఏళ్లు మాత్రమేనని అన్నారు.