News June 5, 2024
మోదీ ప్రమాణ స్వీకారానికి ముహూర్తం ఫిక్స్

నరేంద్ర మోదీ మూడోసారి ప్రధాని పదవి చేపట్టేందుకు డేట్ ఫిక్స్ అయింది. జూన్ 8న ఢిల్లీలోని కర్తవ్యపథ్‌లో ప్రమాణస్వీకార మహోత్సవం జరగనుంది. ఈ కార్యక్రమానికి బీజేపీ పాలిత సీఎంలతో పాటు ఎన్డీఏ కూటమి నేతలు హాజరుకానున్నారు. ఈ ఎన్నికల్లో బీజేపీకి సొంతంగా 240 సీట్లు రాగా మిత్రపక్షాలతో కలిపి ఎన్డీఏ 293 స్థానాల్లో గెలిచింది.
Similar News
News December 10, 2025
‘16.98 లక్షల టన్నుల సముద్ర ఉత్పత్తుల ఎగుమతి’

2024-25 ఆర్థిక సంవత్సరంలో దేశం మొత్తం 16.98 లక్షల టన్నుల సముద్ర ఉత్పత్తులను ఎగుమతి చేసిందని కేంద్ర మత్స్య శాఖ మంత్రి రాజీవ్ రంజన్ తెలిపారు. రాజ్యసభలో బుధవారం ఎంపీ సానా సతీష్ అడిగిన ప్రశ్నకు మంత్రి బదులిచ్చారు. రొయ్యల ఉత్పత్తిలో ముఖ్య కేంద్రంగా కాకినాడ, గోదావరి ప్రాంతం కీలక పాత్ర పోషిస్తుందని మంత్రి వివరించారు. సముద్ర ఉత్పత్తులలో రైతులకు మేలుచేకూర్చే దిశగా చర్యలు తీసుకోవాలని ఎంపీ సూచించారు.
News December 10, 2025
పోలింగ్‌కు ఏర్పాట్లు సిద్ధం.. 890 పంచాయతీలు ఏకగ్రీవం

TG: రేపు జరిగే తొలి విడత పంచాయతీ ఎన్నికల పోలింగ్‌కు ఏర్పాట్లు చేసినట్లు స్టేట్ ఎలక్షన్ కమిషనర్ రాణి కుముదిని ప్రెస్మీట్లో తెలిపారు. తొలి, రెండో విడతల్లో 890 గ్రామాల్లో ఏకగ్రీవమైనట్లు చెప్పారు. ఇప్పటివరకు తనిఖీల్లో రూ.8.2Cr సీజ్ చేశామన్నారు. అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసు శాఖ పటిష్ఠ బందోబస్తు చేపట్టిందని తెలిపారు. 50వేల మంది సివిల్ పోలీసులు, 60 ప్లటూన్స్ టీమ్స్ విధుల్లో ఉన్నట్లు వెల్లడించారు.
News December 10, 2025
దేవుడిని నిందించడం తగునా?

కొందరికి సంపదలు, మరికొందరికి దారిద్ర్యం ఉండటానికి భగవంతుడే కారణమని చాలామంది అనుకుంటారు. కానీ, మన జీవితంలోని లోటుపాట్లకు మనమే బాధ్యులం. మనిషి జీవితం ఈ ఒక్క జన్మకే పరిమితం కాదని, నూరు జన్మల కర్మ ఫలితం ఈ జన్మలో అనుభవిస్తామని శాస్త్రాలు చెబుతాయి. ‘భగవంతుడు అందరిపై సమాన అనుకూలతలు కల్పిస్తాడు. జీవులు తమ స్వభావం, కర్మలకు అనుగుణంగా ఎదుగుతారు. దుష్కర్మలు చేసి, దేవుడిని నిందించడం తప్పు’ అని పేర్కొంటాయి.


