News February 5, 2025

పట్టణాలు చిన్నవే కానీ లగ్జరీ షాపింగ్‌లో టాప్!

image

భారత్‌లో చిన్న పట్టణాల ప్రజలు లగ్జరీ షాపింగ్‌పై భారీగా వెచ్చిస్తున్నారని టాటా క్లిక్ లగ్జరీ నివేదిక తెలిపింది. ఈ-కామర్స్ విస్తృతి పెరగడంతో మారుమూల పట్టణాల ప్రజలు సైతం ఆన్‌లైన్‌లో ఖరీదైన బ్రాండ్ల ఉత్పత్తుల్ని కొనుగోలు చేస్తున్నారని పేర్కొంది. ‘వాచీలు, చెప్పులు, దుస్తులు, యాక్సెసరీస్‌ను ఖర్చుకు వెనుకాడకుండా కొంటున్నారు. ఉత్పత్తిపై పూర్తిగా రిసెర్చ్ చేశాకే కొనుగోలు చేస్తున్నారు’ అని వెల్లడించింది.

Similar News

News January 28, 2026

టుడే టాప్ స్టోరీస్

image

* EUతో ట్రేడ్ డీల్.. కోట్ల మందికి అద్భుత అవకాశాలు: PM మోదీ
* TG: మున్సిపల్ ఎన్నికల షెడ్యూల్ విడుదల.. రేపట్నుంచి నామినేషన్స్
* రేపే మేడారం జాతర.. ప్రజలకు CM రేవంత్ శుభాకాంక్షలు
* సింగరేణిలో అవినీతి జరగలేదు: భట్టి
* ప్రాధాన్య క్రమంలో ప్రాజెక్టులు పూర్తి: చంద్రబాబు
* ‘జనసేన ఎమ్మెల్యే రాసలీలలు’.. YCP సంచలన వీడియో
* సింగర్ అర్జిత్ సింగ్ రిటైర్మెంట్

News January 28, 2026

UK ప్రధానులే లక్ష్యంగా చైనా ఆపరేషన్ ‘సాల్ట్ టైఫూన్’!

image

బ్రిటన్ రాజకీయాల్లో చైనా హ్యాకర్లు కలకలం రేపారు. ఏకంగా ముగ్గురు మాజీ PMలు బోరిస్, సునక్, లిజ్ ట్రస్‌కు క్లోజ్‌గా ఉన్న అధికారుల ఫోన్లను హ్యాక్ చేసినట్లు ‘ది టెలిగ్రాఫ్’ పేర్కొంది. ఆపరేషన్ ‘సాల్ట్ టైఫూన్’ పేరుతో 2021-2024 వరకు ఈ గూఢచర్యానికి పాల్పడినట్లు తెలుస్తోంది. ఇప్పటికీ ఇది కొనసాగుతోందన్న అనుమానాలున్నాయి. ఏకంగా ప్రధాని నివాసంలోకే చైనా హ్యాకర్లు చొరబడ్డారని అక్కడి మీడియా కోడై కూస్తోంది.

News January 28, 2026

బాఫ్టా రేసులో మన ‘బూంగ్’.. మణిపురీ మ్యాజిక్!

image

ఫర్హాన్ అక్తర్ నిర్మించిన మణిపురీ చిత్రం ‘Boong’ ప్రతిష్ఠాత్మక BAFTA 2026 నామినేషన్లలో చోటు సంపాదించింది. లక్ష్మీప్రియా దేవి డైరెక్ట్ చేసిన ఈ మూవీ ‘బెస్ట్ చిల్డ్రన్స్ ఫిల్మ్’ కేటగిరీలో పోటీ పడుతోంది. మణిపుర్ నేపథ్యంతో సాగే ఓ బాలుడి కథతో తీసిన ఈ మూవీ ఇప్పటికే అంతర్జాతీయ ఫిల్మ్ ఫెస్టివల్స్‌లో రచ్చ చేస్తోంది. గ్లోబల్ స్టేజ్‌పై ఇండియన్ రీజినల్ సినిమా ఇలా మెరవడంపై ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి.