News May 31, 2024

రేపు చరణ్ చేతుల మీదుగా ‘మనమే’ ట్రైలర్ విడుదల

image

టాలీవుడ్ యంగ్ హీరో శర్వానంద్ లేటెస్ట్ మూవీ ‘మనమే’. ఇప్పటికే పోస్టర్స్, ఫస్ట్ సాంగ్ రిలీజ్ కాగా.. ట్రైలర్‌పై చిత్ర యూనిట్ అప్‌డేట్ ఇచ్చింది. రేపు ఉదయం 11.07 గంటలకు గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ట్రైలర్‌ను రిలీజ్ చేస్తారని ప్రకటించింది. శ్రీరామ్ ఆదిత్య డైరెక్ట్ చేసిన ఈ సినిమాలో కృతి శెట్టి హీరోయిన్‌గా నటించారు. జూన్ 7న మూవీ రిలీజ్ కానుంది.

Similar News

News February 20, 2026

26న టీమ్ ఇండియా Vs జింబాబ్వే.. తేలిగ్గా తీసుకుంటే..

image

T20WC: ఆస్ట్రేలియా, శ్రీలంక లాంటి పెద్ద జట్లపై విజయాలతో జింబాబ్వే జోరు మీదుంది. ఈ నెల 26న సూపర్-8లో భాగంగా టీమ్ ఇండియాతో తలపడనుంది. దీంతో ఆ జట్టును ఈజీగా తీసుకోవద్దని ఫ్యాన్స్ అంటున్నారు. ముఖ్యంగా ఓపెనర్ బెన్నెట్, ఆల్‌రౌండర్ సికందర్ రజా ఆ టీమ్‌కు వెన్నుముకలా మారారు. బౌలింగ్, బ్యాటింగ్, ఫీల్డింగ్.. ఇలా అన్ని రంగాల్లో అదుర్స్ అనిపిస్తున్నారు.

News February 20, 2026

కొత్త బాస్‌లు వీరేనా?

image

TG: వచ్చేనెలలో CS రామకృష్ణారావు పదవీకాలం ముగియనుండగా వికాస్ రాజ్, జయేశ్ రంజన్, సవ్యసాచి పేర్లను ప్రభుత్వం పరిశీలిస్తోంది. జయేశ్‌కు అడ్మినిస్ట్రేషన్‌పై పట్టుండటంతో CM సానుకూలంగా ఉన్నారు. వచ్చే ఏడాదే ఆయనతో పాటు సవ్యసాచి రిటైర్మెంట్ కానుండటం ప్రతికూలంగా మారింది. 2028 వరకు సర్వీస్‌ ఉన్న వికాస్‌కు ఎక్కువ ఛాన్సుంది. రామకృష్ణారావు పొడిగింపుపైనా ఆలోచిస్తోంది. DGP నియామకంలో CV ఆనంద్ పేరు వినిపిస్తోంది.

News February 20, 2026

పంటలను నాశనం చేస్తున్న ఆఫ్రికన్ నత్తలు

image

పంటలపై ఆఫ్రికన్ నత్తల దాడుల ఘటనలు తెలుగు రాష్ట్రాల్లో పెరిగిపోయాయి. ఇవి పొలాలు, తోటల్లో చేరి మొక్కల ఆకులు, కాయలు, పండ్లను తినడం వల్ల తీవ్ర పంట నష్టం కలగడంతో పాటు రైతులు ఆర్థికంగా నష్టపోతున్నారు. ముఖ్యంగా బొప్పాయి, మామిడి, అరటి, కాఫీ, రబ్బరు, పత్తి, రాగులు, కొబ్బరి, పొద్దుతిరుగుడు, అపరాలు, నూనెగింజలు, వంగ, దోస, క్యాబేజి, బెండ, మల్బరీ, బంతి తోటల్లో వీటి ముప్పు ఎక్కువైందని నిపుణులు చెబుతున్నారు.