News November 8, 2024

మా సినిమా ట్రైలర్ లాక్ అయింది: పుష్ప టీమ్

image

పుష్ప-2 సినిమా విడుదల దగ్గర పడుతున్న నేపథ్యంలో ఆ మూవీ టీమ్ ప్రమోషన్స్ జోరు పెంచింది. రిలీజ్ ట్రైలర్‌ను లాక్ చేసినట్లు ప్రకటించింది. ‘ఎదురుచూపులు ముగిశాయి. ది రూల్ టేక్స్ ఓవర్. త్వరలో ట్రైలర్ అనౌన్స్‌మెట్’ అని ట్వీట్ చేసింది. వచ్చే నెల 5న పుష్ప: ది రూల్ విడుదల కానున్న సంగతి తెలిసిందే. సుకుమార్ డైరెక్షన్లో అల్లు అర్జున్, రష్మిక జంటగా నటించిన ఈ మూవీని మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ నిర్మించింది.

Similar News

News February 9, 2026

5 పరుగుల తేడాతో 6 వికెట్లు డౌన్!

image

T20WC: స్కాట్లాండ్‌తో ఇవాళ జరిగిన మ్యాచ్‌లో ఇటలీ ఘోర పరాజయం చెందిన విషయం తెలిసిందే. 208 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఆ జట్టు 134 రన్స్‌కే ఆలౌటైంది. 129-134 రన్స్ మధ్య 6 వికెట్లు కోల్పోవడం ఓటమికి ప్రధాన కారణమైంది. మరోవైపు ఓపెనర్లు సైతం శుభారంభం అందించలేదు. బెన్ మనేంటి ఒక్కరే హాఫ్ సెంచరీ(52)తో రాణించారు.

News February 9, 2026

RSS కృషి వల్లే BJP ఎదిగింది: మోహన్ భాగవత్

image

సంఘ్ కార్యకర్తలు చేసిన నిరంతర కృషి, సైద్ధాంతిక నిబద్ధత వల్లే ‘అచ్చే దిన్’ వచ్చాయని RSS చీఫ్ మోహన్ భాగవత్ తెలిపారు. బీజేపీ అధికారంలోకి వచ్చినందుకు కాదన్నారు. దశాబ్దాల సంఘ్ సైద్ధాంతిక కృషి వల్లే బీజేపీ ఎదిగిందని పేర్కొన్నారు. మోదీ ప్రధాని కావడానికి సంఘ్ కృషే కారణమని చాలా మంది నమ్ముతారన్నారు. అయితే BJP ఒక స్వతంత్ర రాజకీయ సంస్థగా తన పని తాను చేసుకుపోతుందని వ్యాఖ్యానించారు.

News February 9, 2026

IAF అగ్నివాయు నాన్ కంబాటెంట్ పోస్టులకు దరఖాస్తుల ఆహ్వానం

image

ఇండియన్ ఎయిర్‌ఫోర్స్(<>IAF<<>>) అగ్నిపథ్ స్కీం కింద అగ్నివాయు నాన్ కంబాటెంట్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. టెన్త్ అర్హతతో పాటు శారీరక ప్రమాణాలు కలిగిన వారు ఫిబ్రవరి 23 వరకు ఆఫ్‌లైన్ ద్వారా అప్లై చేసుకోవచ్చు. అభ్యర్థులు జులై 2, 2005-జనవరి 2, 2009 మధ్య జన్మించి ఉండాలి. స్క్రీనింగ్, రాత పరీక్ష, PFT, మెడికల్ టెస్ట్, DV ద్వారా ఎంపిక చేస్తారు. వెబ్‌సైట్: https://agnipathvayu.cdac.in