News February 24, 2025
ఖజానా ఖాళీ..! డబ్బులు ఇల్లె..!!

దేశంలో ఇటీవల కొత్తగా ముఖ్యమంత్రులు అయిన వారంతా చెబుతున్న మాటలివి. పథకాలు అమలు చేద్దామన్నా, ఆర్థికపర నిర్ణయాలు తీసుకుందామన్నా ఖజానా ఖాళీ అయింది అని మొన్న తెలంగాణ సీఎం రేవంత్, నిన్న ఏపీ సీఎం చంద్రబాబు, నేడు ఢిల్లీ సీఎం రేఖ అంటున్నారు. ఇందుకు చెప్పే కామన్ కారణం గత పాలకుల నిర్ణయాలు. రేపటి పాలకులు ఈ మాట చెప్పొద్దంటే కనీస అవసరాలు కాని ఉచితాలు ఆపేయడమే పరిష్కార మార్గం. నేతలు ఈ నిర్ణయం తీసుకోగలరా?
Similar News
News February 24, 2025
BREAKING: ఎమ్మెల్సీ ఎన్నికల షెడ్యూల్ విడుదల

తెలుగు రాష్ట్రాల్లో ఎమ్మెల్యేల కోటా ఎమ్మెల్సీ ఎన్నికల షెడ్యూల్ను ఈసీ విడుదల చేసింది. ఏపీలో 5, తెలంగాణలో 5 ఖాళీలున్నాయి. మార్చి 3న నోటిఫికేషన్ వెలువడనుంది. మార్చి 20న పోలింగ్, అదే రోజు కౌంటింగ్ ఉండనుంది. ఏపీలో జంగా కృష్ణమూర్తి, యనమల రామకృష్ణుడు, పరుచూరి అశోక్ బాబు, తిరుమలనాయుడు, రామారావు, తెలంగాణలో మహమూద్ అలీ, సత్యవతి, సుభాష్ రెడ్డి, మల్లేశం, రియాజుల్ హుస్సేన్ పదవీ కాలం వచ్చే నెలతో ముగియనుంది.
News February 24, 2025
2028లో మేమే అధికారంలోకి వస్తాం: జగన్

AP: అసెంబ్లీ సమావేశాలకు దూరంగా ఉండాలని వైసీపీ నిర్ణయించినట్లు జగన్ తెలిపారు. పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో ఆయన సమావేశమయ్యారు. తాను 30 ఏళ్ల పాటు రాజకీయాల్లో ఉంటానని జగన్ చెప్పారు. అసెంబ్లీకి వెళ్లకపోయినా ప్రజా సమస్యల కోసం పోరాడుతామని చెప్పారు. 2028 జమిలి ఎన్నికల్లో తాము అధికారంలోకి వస్తామని ధీమా వ్యక్తం చేశారు. వైసీపీ ఇచ్చిన ఇళ్లను వెనక్కితీసుకుంటే ఊరుకునేది లేదని తేల్చిచెప్పారు.
News February 24, 2025
కేసీఆర్ను ప్రజలు తిరస్కరించారు: రేవంత్ రెడ్డి

TG: ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఏ అభ్యర్థికి ఓటెయ్యాలని చెబుతుందో సమాధానం చెప్పాలని సీఎం రేవంత్ రెడ్డి డిమాండ్ చేశారు. బీఆర్ఎస్, బీజేపీ కుట్రలు చేస్తున్నాయని మండిపడ్డారు. నిజామాబాద్లో పట్టభద్రుల ఆత్మీయ సమ్మేళనంలో ఆయన మాట్లాడారు. రాజకీయ పార్టీ అని చెప్పుకునేందుకు బీఆర్ఎస్కు అర్హత ఉందా అని ప్రశ్నించారు. కేసీఆర్ను ప్రజలు తిరస్కరించారన్నారు.