News August 19, 2025
తీరనున్న యూరియా కష్టాలు!

తెలంగాణలోని రైతులకు యూరియా కష్టాలు త్వరలో తీరనున్నాయి. 50వేల మెట్రిక్ టన్నుల యూరియాను రాష్ట్రానికి కేటాయిస్తూ కేంద్రం నిర్ణయం తీసుకుంది. గుజరాత్, కర్ణాటక నుంచి యూరియా తరలింపునకు ఆదేశించింది. మరో వారం రోజుల్లోనే రాష్ట్రానికి యూరియా వస్తుందని మంత్రి తుమ్మల స్పష్టం చేశారు. కాగా రాష్ట్రంలో యూరియా కొరత కారణంగా చాలాచోట్ల రైతులు ఆందోళనలు చేపట్టారు.
Similar News
News August 20, 2025
EPFOలో 230 ఉద్యోగాలు.. గడువు పెంపు

EPFOలో 230 ఉద్యోగాల దరఖాస్తుకు గడువును పొడిగించారు. ఈనెల 18తో అప్లికేషన్ తేదీ ముగియగా 22 వరకు పెంచుతూ UPSC నిర్ణయం తీసుకుంది. ఇందులో ఎన్‌ఫోర్స్‌మెంట్ ఆఫీసర్, అకౌంట్స్ ఆఫీసర్, అసిస్టెంట్ ప్రావిడెంట్ ఫండ్ కమిషనర్ పోస్టులు ఉన్నాయి. అభ్యర్థులు ఏదైనా డిగ్రీ పాసై, 35 ఏళ్లలోపు ఉండాలి. లెవెల్-8, లెవెల్-10 వేతన శ్రేణి కింద జీతాలు అందుతాయి.
వెబ్‌సైట్: <
News August 20, 2025
ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా తెలుగు వ్యక్తి.. ఈ పార్టీలు ఎటువైపు?

ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా జస్టిస్ సుదర్శన్ రెడ్డి పేరును INDI కూటమి ప్రకటించడం TDP, JSP, YCP, BRSలను ఇరకాటంలోకి నెట్టాయి. వెంకయ్య నాయుడు తర్వాత మరోసారి తెలుగు వ్యక్తి ఉపరాష్ట్రపతి అయ్యే అవకాశం వచ్చింది. కానీ APలో BJPతో కలిసి కూటమి ప్రభుత్వం ఏర్పాటు చేసిన TDP, JSP పొత్తు ధర్మం పాటిస్తాయా? లేక తెలుగు వ్యక్తికి ఓటేస్తాయా అన్నది ఆసక్తికరం. YCP, BRS కూడా ఎటువైపు ఉంటాయన్నది చర్చనీయాంశంగా మారింది.
News August 20, 2025
రెవెన్యూ అధికారులకు సెలవులు రద్దు: మంత్రి అనగాని

APలోని చాలా ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో రెవెన్యూ శాఖను మంత్రి అనగాని సత్యప్రసాద్ అప్రమత్తం చేశారు. ఆ శాఖ అధికారులకు సెలవులను రద్దు చేసినట్లు వెల్లడించారు. సోషల్ మీడియాలో వదంతులు, తప్పుడు ప్రచారాలను ప్రజలు నమ్మవద్దని సూచించారు. ప్రకాశం బ్యారేజీకి వరద ఉద్ధృతి పెరుగుతున్న నేపథ్యంలో కరకట్టకు ఆనుకుని ఉన్న లంక గ్రామాల ప్రజలను అవసరమైతేే పునరావాస కేంద్రాలకు తరలించాలని ఆదేశించారు.