News July 14, 2024

ఆగస్టు నెలాఖరుకు పూర్తిస్థాయిలో U-win పోర్టల్

image

గర్భిణులు, పిల్లల టీకాల పంపిణీ నమోదు కోసం ఆగస్టు నెలాఖరుకు U-win పోర్టల్‌ పూర్తిస్థాయిలో అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. ప్రభుత్వ, ప్రైవేటు ఆస్పత్రుల్లో డిప్తీరియా, మీజిల్స్, రూబెల్లా తదితర వ్యాధులను ఎదుర్కొనేందుకు అందించే టీకాల వివరాలను ఇందులో పొందుపరుస్తారు. దీనివల్ల వ్యాక్సినేషన్ సర్టిఫికెట్లను సులభంగా పొందొచ్చు. ఇప్పటికే బెంగాల్ మినహా అన్ని రాష్ట్రాల్లో పైలట్ ప్రాజెక్టుగా చేపడుతున్నారు.

Similar News

News April 1, 2026

నయన్ సెన్సేషన్.. ఒకేసారి 5 భాషల్లో!

image

నటి నయనతార ఒకేసారి 5 భాషల్లో అగ్ర హీరోలతో నటిస్తూ పాన్ ఇండియా హీరోయిన్‌‌గా నిలుస్తున్నారు. ప్రస్తుతం తెలుగులో ఓ మూవీ షూటింగ్ దశలో ఉండగా తమిళ్‌లో 2 చిత్రాలు విడుదలకు రెడీ అయ్యాయి. మరొకటి షూటింగ్ జరుపుకుంటోంది. మలయాళంలో 2 సినిమాలు సెట్స్‌పై ఉన్నాయి. కన్నడలో నయన్ యాక్ట్ చేసిన టాక్సిక్ రిలీజ్‌కు సిద్ధమైంది. అటు బాలీవుడ్‌లో ఇప్పటికే షారుఖ్‌తో నటించిన ఆమె తాజాగా సల్మాన్‌తో స్క్రీన్ షేర్ చేసుకోనున్నారు.

News April 1, 2026

Gmail ఐడీకి తోకలు.. గుడ్‌న్యూస్ చెప్పిన పిచాయ్

image

పాత Gmail ఐడీలో ‘తోకలు’(saiRam143), వింత పేర్లున్నాయని ఇబ్బంది పడుతున్నారా? గూగుల్ మీకోసం ఓ అదిరిపోయే అప్‌డేట్ తెచ్చింది. మీ పాత యూజర్‌నేమ్ మార్చుకునే సదుపాయాన్ని కల్పిస్తున్నట్లు గూగుల్ సీఈవో సుందర్ పిచాయ్ ప్రకటించారు. దీనికోసం గూగుల్ సెట్టింగ్స్‌లోకి వెళ్లి.. అందుబాటులో ఉన్న నచ్చిన పేరును ఎంచుకోండి. పాత ఐడీ అలాగే ఉన్నప్పటికీ రెండు పేర్లతోనూ సైన్ ఇన్ అవ్వొచ్చు. ID మార్చుకునేవారికిది శుభవార్తే.

News April 1, 2026

ఇవాళ 11amకు YS జగన్ ప్రెస్‌మీట్

image

AP: వైసీపీ అధినేత, మాజీ సీఎం YS జగన్ ఇవాళ ప్రెస్‌మీట్ నిర్వహించనున్నారు. ఉదయం 11 గంటలకు తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడతారని ఆ పార్టీ ప్రకటించింది. ఇవాళ పార్లమెంటులో రాజధాని అమరావతి బిల్లు ప్రవేశపెట్టనున్న నేపథ్యంలో జగన్ ప్రెస్‌మీట్ ప్రాధాన్యం సంతరించుకుంది. రాజధానిపై పార్టీ స్టాండ్ ఏంటో ప్రకటించే ఆస్కారముందని రాజకీయ వర్గాలు చర్చించుకుంటున్నాయి.