News March 12, 2025
ఉద్యోగం కోసం నిరుద్యోగుల క్యూ!

ఓ వైపు 40+ డిగ్రీల ఎండ. ఎప్పుడు లోపలికి పిలుస్తారో తెలియదు. కానీ, ఉద్యోగం సాధించాలనే పట్టుదలతో గంటల తరబడి లైన్లో వేచి ఉన్నారీ నిరుద్యోగులు. ఈ దృశ్యం హైదరాబాద్ గచ్చిబౌలిలోని అమెజాన్ కంపెనీ వద్ద కనిపించింది. ఇంటర్వ్యూ కోసం ఇంతమంది రావడంతో నిరుద్యోగం ఎంతలా పెరిగిందో చూడాలంటూ నెటిజన్లు ట్వీట్స్ చేస్తున్నారు. సాఫ్ట్వేర్ కంపెనీల వద్ద ఇలాంటి దృశ్యాలు కనిపిస్తూనే ఉంటాయని చెబుతున్నారు.
Similar News
News December 15, 2025
చంద్రగిరి పోలీసులకు వార్నింగ్ ఇచ్చిన గంజాయ్ లీడర్?

చంద్రగిరి (M) తొండవాడలో సంధ్య అనే మహిళను కత్తితో బెదిరించి అసభ్యంగా ప్రవర్తించిన గౌతమ్ కుమార్ అలియాస్ పెప్సీని పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ క్రమంలో పోలీసులకు గౌతమ్ వార్నింగ్ ఇచ్చినట్లు తెలుస్తోంది. ‘నేను గంజాయి డీలర్‌ను, నేను బయటకు వస్తే మీ అంతు చూస్తా. నా వెనుక చోటా నేతలు ఉన్నారు. మీరు ఏం చేయలేరు’ అని బెదిరింపులకు పాల్పడ్డాడని సమాచారం.
News December 15, 2025
యూరియా బుకింగ్ కోసం యాప్: తుమ్మల

TG: యాసంగికి సరిపడా యూరియా అందుబాటులో ఉంచుతామని వ్యవసాయ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. రైతులు బారులు తీరాల్సిన అవసరం లేకుండా ఇంటి నుంచే యూరియా బుక్ చేసుకునేందుకు త్వరలో మొబైల్ యాప్ విడుదల చేస్తామన్నారు. కాగా ఇప్పటికే 2.48 లక్షల టన్నుల ఎరువులు రాష్ట్రంలో అందుబాటులో ఉండగా.. డిసెంబర్‌కు కేటాయించిన యూరియా కూడా చేరుతుందని అధికారులు అంచనా వేస్తున్నారు.
News December 15, 2025
ఇంధన ధరల్లో తేడాకు అవే కారణం: కేంద్రం

ఢిల్లీ, ముంబైతో పోలిస్తే ఏపీలో పెట్రోల్, డీజిల్ ధరలు ఎక్కువగా ఉండటంపై రాజ్యసభలో కేంద్ర మంత్రి సురేశ్ గోపీ రాతపూర్వక సమాధానం ఇచ్చారు. ‘అమరావతిలో లీటర్ పెట్రోల్ ధర రూ.109.74, అండమాన్&నికోబార్‌లో రూ.82.46గా ఉంది. రవాణా ఖర్చులు, ఆయా రాష్ట్ర/UT ప్రభుత్వాలు విధించే VAT (వాల్యూ యాడెడ్ ట్యాక్స్)లో తేడాలే ఇందుకు కారణం’ అని తెలిపారు. ఏపీలో లీటర్ పెట్రోల్ పై VAT రూ.21.90, అండమాన్‌లో రూ.0.82గా ఉంది.


