News March 24, 2024

ఎన్నికల్లో పోటీ చేయనని ప్రకటించిన కేంద్రమంత్రి

image

కేంద్ర మంత్రి వీకే సింగ్ సంచలన ప్రకటన చేశారు. రాబోయే లోక్‌సభ ఎన్నికల్లో తాను పోటీ చేయడం లేదని తెలిపారు. ఈ విషయాన్ని ట్విటర్ వేదికగా వెల్లడించారు. ఘజియాబాద్‌ను ప్రపంచ స్థాయి నగరంగా మార్చేందుకు పదేళ్ల పాటు అవిశ్రాంతంగా కృషిచేశానని తెలిపారు. ఆలోచించే నిర్ణయం తీసుకున్నానని.. తనకు మద్దతుగా నిలిచిన అందరికీ కృతజ్ఞతలు తెలిపారు. తాజాగా ప్రకటించిన జాబితాలో ఈ స్థానంలో అతుల్ గర్గ్‌కు బీజేపీ చోటు కల్పించింది.

Similar News

News November 24, 2025

సిరిసిల్ల: యోగాలో మెరిసిన గిరిజన బిడ్డ

image

సిరిసిల్ల జిల్లా వీర్నపల్లి మండలం బంజేరు గ్రామానికి చెందిన గిరిజన విద్యార్థిని బట్టు మనస్విని, ఒడిశా వేదికగా నవంబర్ 11-15 తేదీల్లో జరిగిన 4వ EMRS జాతీయ క్రీడా పోటీల్లో రజత పతకం సాధించి రాష్ట్ర గౌరవాన్ని నిలబెట్టింది. గతంలోనూ ఆమె నేషనల్ యోగా ఒలింపియాడ్, రాష్ట్ర స్థాయి పోటీల్లో కాంస్య పతకాలు దక్కించుకుంది. జాతీయ స్థాయిలో పతకం సాధించిన మనస్వినిని పలువురు అభినందించారు.

శుభ సమయం (24-11-2025) సోమవారం

image

✒ తిథి: శుక్ల చవితి సా.5.55 వరకు
✒ నక్షత్రం: పూర్వాషాడ రా.7.40 వరకు
✒ శుభ సమయాలు: లేవు
✒ రాహుకాలం: ఉ.7.30-ఉ.9.00
✒ యమగండం: ఉ.10.30-మ.12.00
✒ దుర్ముహూర్తం: మ.12.24-మ.1.12, మ.2.46-మ.3.34
✒ వర్జ్యం: తె.4.08-ఉ.5.50
✒ అమృత ఘడియలు: మ.2.53-సా.4.35