News October 20, 2024

ఔషధ ఎగుమతుల విలువ 9.42 బిలియన్ డాలర్లు

image

ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ఏప్రిల్- ఆగస్టు మధ్య భారత్ ఔషధ ఎగుమతుల విలువ 9.42 బిలియన్ డాలర్లుగా ఉన్నట్లు కేంద్రవాణిజ్య శాఖ తెలిపింది. గతేడాది ఇదే కాలంతో పోల్చి చూస్తే 10.8% పెరిగినట్లు చెప్పింది. మన దేశంలో అత్యున్నత ప్రమాణాలతో కూడిన తయారీ ఇందుకు మద్దతుగా నిలుస్తోందని పేర్కొంది. సర్జికల్ ఉత్పత్తుల ఎగుమతులు 3.3% వృద్ధితో 0.29 బి.డాలర్లుగా నమోదయ్యాయి. US, యూరప్‌లు కీలక మార్కెట్లుగా ఉన్నాయి.

Similar News

News November 21, 2025

రొటేషన్ పద్ధతిలో రిజర్వేషన్లు!

image

TG: త్వరలో జరగనున్న పంచాయతీ ఎన్నికల్లో ఏ గ్రామానికి ఏ రిజర్వేషన్ దక్కుతుందనే చర్చ మళ్లీ మొదలైంది. గతంలో ఉన్న రిజర్వేషన్లు మారనున్నాయి. జనాభా ప్రాతిపదికన వీటిని ఖరారు చేయనున్నారు. రొటేషన్ పద్ధతిలో రిజర్వేషన్లు ఇవ్వాలని ప్రభుత్వం భావిస్తోంది. దీంతో ఇప్పుడున్న కేటగిరీకి కాకుండా మరో కేటగిరీకి ఛాన్స్ రానుంది. దీనిపై రేపు వెలువడే జీవోతో క్లారిటీ రానుంది. రాష్ట్రంలో 12,760గ్రామాల్లో ఎన్నికలు జరగనున్నాయి.

వాట్సాప్‌లో అందుబాటులోకి షెడ్యూల్ కాల్ ఫీచర్..

image

టీమ్స్, గూగుల్ మీట్ తరహా ఫీచర్‌ను వాట్సాప్ అందుబాటులోకి తెచ్చింది. దీంతో ఎంప్లాయీస్, ఫ్రెండ్స్, ఫ్యామిలీతో మీటింగ్ షెడ్యూల్ చేసుకోవచ్చు. వాయిస్‌తోపాటు వీడియో కాల్ ఆప్షన్‌ కూడా అందుబాటులో ఉంది. కాల్ పెడుతున్న ఉద్దేశం చెప్పొచ్చు. ఎవరు కనెక్ట్ కావాలో సెలెక్ట్ చేసుకోవచ్చు. జనరేట్ అయిన లింకును కాపీ చేసి పార్టిసిపెంట్స్‌కు షేర్ చేయవచ్చు. కాల్ మొదలయ్యే ముందు పార్టిసిపెంట్స్‌కు నోటిఫికేషన్ వెళుతుంది.