News April 6, 2024
ఈ మొబైల్ నంబర్ విలువ రూ.7కోట్లు

ఫ్యాన్సీ నంబర్ ప్లేట్లు, ఫోన్ నంబర్లకు డిమాండ్ ఉండటం కామన్. సంపన్నులు ఫ్యాన్సీ నంబర్ల కోసం ఎంతైనా ఖర్చు చేసేందుకు వెనకాడరు. దుబాయ్లో ఈ ఫ్యాన్సీ నంబర్ల కోసం ఓ వేలంపాట జరిగింది. అందులో 058-7777777 ఫోన్ నంబర్ రికార్డు స్థాయిలో రూ.7కోట్లు పలికింది. ఈ నంబర్కు రూ.22లక్షలతో వేలం ప్రారంభం కాగా.. దీన్ని దక్కించుకునేందుకు విపరీతమైన పోటీ ఏర్పడింది. మరో నంబర్ 054-5555555 కూడా రూ.6.5కోట్లు పలికింది.
Similar News
News October 17, 2025
పిల్లలు చదవట్లేదా?

సాధారణంగా చాలామంది పిల్లలు చదువంటే ఆసక్తి చూపరు. ఆటలమీదే మనసు ఉంటుంది. కొన్నిసార్లు ఇది మానసిక సమస్యకు సంకేతం అంటున్నారు నిపుణులు. బార్డర్లైన్ ఇంటిలిజెన్స్, స్పెసిఫిక్ లర్నింగ్ డిజెబిలిటి, ADHD వంటి సమస్యలుంటే పాఠాలు అర్థంకాకపోవడం, ఏకాగ్రత లోపించడం వంటి లక్షణాలుంటాయి. వీటిని గుర్తిస్తే చైల్డ్ సైకియాట్రిస్ట్ దగ్గరికి తీసుకెళ్లండి. చదువంటే భయం తగ్గి ఆసక్తి కలిగే పద్ధతులు నేర్పిస్తారు.
News October 17, 2025
సమ్మె విరమించాల్సిందే!

AP: సమ్మె విరమించాలని, లేకపోతే చర్యలు తప్పవని PHC వైద్యులను వైద్యారోగ్యశాఖ హెచ్చరించింది. ఇన్ సర్వీస్ పీజీ కోటాను పునరుద్ధరణతో పాటు ఇతర సమస్యల పరిష్కారానికి గత నెల 30 నుంచి ఆందోళన చేస్తున్నారు. ఇప్పటికే పలు దఫాలుగా ఉన్నతాధికారులు చర్చలు జరిపినా సఫలం కాలేదు. ఎస్మా సైతం ప్రయోగిస్తామని చెప్పినా వాళ్లు వెనక్కి తగ్గలేదు. తాజాగా నోటీస్-3 జారీ చేయగా, PHC వైద్యులు ఏం విధంగా స్పందిస్తారో చూడాల్సి ఉంది.
News October 17, 2025
‘గోత్రం’ అంటే మీకు తెలుసా?

గోత్రం అంటే ‘గోవులను రక్షించువారు’ అని అర్థం. ‘గో’ అంటే గోవులు. ‘త్ర’ అంటే రక్షించడం. క్షీర సాగర మథన సమయంలో 5 గోవులు ఉద్భవించాయి. ఒక్కో గోవును ఒక్కో మహర్షి తీసుకెళ్లి, పెంచి, వాటి సంతతిని కాపాడి, సమాజంలోని అందరికీ అందించారు. ఆ గోవులను కాపాడిన మహర్షుల పేర్ల మీద మన గోత్రాలు ఏర్పడ్డాయి. గోత్రం ఉండే ప్రతి ఒక్కరూ గోవులను రక్షించేవారేనని అర్థం.
☞ మరిన్ని ధర్మ సందేహాల నివృత్తి కోసం <<-se_10013>>భక్తి <<>>కేటగిరీ.