News August 15, 2025
తెలంగాణ ముఖచిత్రమే మారిపోతుంది: రేవంత్

TG: త్వరలోనే వరంగల్, ఆదిలాబాద్ ఎయిర్‌పోర్టులు నిర్మిస్తామని CM రేవంత్ తెలిపారు. ‘RRR, రీజినల్ రింగ్ రైల్వే లైన్ కోసం ప్రయత్నిస్తున్నాం. ఇవి వస్తే రాష్ట్ర ముఖచిత్రమే మారిపోతుంది. ఫ్యూచర్ సిటీని గొప్ప నగరంగా తీర్చిదిద్దుతాం. వెయ్యేళ్లు ప్రజలు చెప్పుకునేలా మెట్రో రైలు విస్తరణ, ఫ్యూచర్ సిటీ ఉంటాయి. యావత్ దేశం చూపు TG వైపు ఉండేలా చేస్తాం’ అని HYDలో క్రెడాయ్ ప్రాపర్టీ షో ప్రారంభోత్సవంలో CM అన్నారు.
Similar News
News August 15, 2025
తెలంగాణ డీజీపీ జితేందర్ తల్లి కన్నుమూత

తెలంగాణ డీజీపీ జితేందర్ ఇంట్లో విషాదం చోటుచేసుకుంది. ఆయన తల్లి కృష్ణ గోయల్ (85) కన్నుమూశారు. అనారోగ్యంతో అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచారు. రేపు జూబ్లీహిల్స్‌లోని మహాప్రస్థానంలో ఆమె అంత్యక్రియలు జరగనున్నాయి. ఆమె మృతి పట్ల రాజకీయ నేతలు, పోలీస్ అధికారులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు.
News August 15, 2025
శిథిలాల కింద 500 మంది ఉండొచ్చు: ఫరూక్ అబ్దుల్లా

జమ్మూకశ్మీర్ కిష్త్వార్‌లో భారీ వరదల వల్ల 60మందికి పైగా మరణించిన విషయం తెలిసిందే. అయితే, శిథిలాల కింద 500 మంది వరకు చిక్కుకొని ఉంటారని నేషనల్ కాన్ఫరెన్స్ చీఫ్ ఫరూక్ అబ్దుల్లా అభిప్రాయపడ్డారు. అయితే ఆ సంఖ్య వెయ్యికి పైగా ఉంటుందని పలువురు అధికారులు చెబుతున్నట్లు వివరించారు. ఇదో విషాదకర ఘటన అని ఆవేదన వ్యక్తం చేశారు. మృతులకు ఆయన సంతాపం తెలియజేశారు. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.
News August 15, 2025
స్వదేశీ సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్స్ ఎప్పుడొస్తాయో?

మన దేశంలో విదేశాలకు చెందిన వాట్సాప్, యూట్యూబ్, ట్విటర్ (X), ఫేస్‌బుక్, స్నాప్‌చాట్, ఇన్‌స్టాగ్రామ్ లాంటి సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లదే హవా. అయితే మన యువత స్వదేశీ సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లను రూపొందించాలని ప్రధాని మోదీ ఇవాళ పిలుపునిచ్చారు. గతంలో హైక్, చింగారి, కూ, మోజ్, రొపొసొ లాంటివి వచ్చినా ఎక్కువ రోజులు నిలబడలేకపోయాయి. యాప్ డిజైనింగ్‌లో లోపాలు, యూఐ లాంటి సమస్యలతో యూజర్లు వాటిని ఆదరించట్లేదు.