News September 26, 2025

సోమరితనం నశింపజేసే శ్రీవారి దర్శనం

image

శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో మలయప్పస్వామి నేటి ఉదయం యోగ నరసింహుడి అలంకారంలో, సింహ వాహనంపై దర్శనమిస్తారు. దశావతారాల్లో నరసింహ అవతారం సింహం గొప్పదనంతో పాటు బలం, వేగం, ధైర్యాన్ని తెలియజేస్తుంది. భక్తులు సింహం అంతటి భక్తి బలంతో ఉంటే దేవుడి అనుగ్రహం లభిస్తుందని ఈ వాహన సేవ అంతరార్థం. దుష్టశిక్షణ, శిష్టరక్షణ కోసం స్వామి ఈ వాహనంపై విహరిస్తూ భక్తుల సోమరితనాన్ని నశింపజేసి, విజయాన్ని ప్రసాదిస్తారని ప్రతీతి.

Similar News

News February 7, 2026

సడన్‌గా తగ్గిన రష్యా చమురు దిగుమతులు!

image

2025లో భారత్‌కు రష్యా నుంచి వచ్చే క్రూడాయిల్ ఇంపోర్ట్స్ ఒక్కసారిగా పడిపోయాయి. జూన్‌లో రోజుకు 20లక్షల బ్యారెళ్ల వద్ద టాప్ లెవల్‌కు చేరుకోగా.. నవంబర్ తర్వాత సీన్ రివర్స్ అయింది. US ఆంక్షలు, ట్రేడ్ రూల్స్ మారడంతో ఒక్కసారిగా దిగుమతులు పడిపోయాయి. ఒకప్పుడు 44% షేర్ ఉన్న రష్యా ఆయిల్ జనవరి నాటికి 22%కి పడిపోయింది. ప్రస్తుతం రోజుకు 11.6 లక్షల బ్యారెళ్లకు పరిమితమైనా ఇప్పటికీ రష్యా కీలక సప్లయర్‌గానే ఉంది.

News February 7, 2026

ఒక్క ప్రమాదం.. ముమైత్ జీవితం తలకిందులు!

image

ఒకప్పుడు ఐటమ్ సాంగ్స్‌తో సినీ ప్రేక్షకులను ఉర్రూతలూగించిన ముమైత్ ఖాన్ ఇప్పుడు సినిమాల్లో కనిపించడం లేదు. ప్రస్తుతం తాను HYDలో మేకప్&హెయిర్ ట్రైనింగ్ ఇన్‌స్టిట్యూట్ నడుపుతున్నట్లు ఆమె ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు. ‘నాకు 30 ఏళ్లున్నప్పుడు ఇంట్లో జారిపడడంతో తలకు గాయమైంది. మెదడు నరాలు దెబ్బతిన్నాయి. 15రోజులు కోమాలో ఉన్నా. ఏడేళ్లు మంచానికే పరిమితమయ్యా. ఆ సమయంలో మా అమ్మే నన్ను చూసుకుంది’ అని తెలిపారు.

News February 7, 2026

గులాబీ తోటల్లో కనిపించే చీడపీడలు

image

శుభకార్యాలు, వ్యక్తిగత అవసరాల కారణంగా ప్రస్తుతం గులాబీ పూల వినియోగం బాగా పెరిగింది. మార్కెట్ డిమాండ్‌ బట్టి గులాబీ సాగుకు రైతులు కూడా ఆసక్తి చూపుతున్నారు. ఈ పువ్వుల సాగులో చీడపీడల సమస్య రైతులకు ఆందోళన కలిగిస్తోంది. ముఖ్యంగా గులాబీ పంటకు పువ్వు, మొగ్గలు తొలిచేపురుగు.. ఆకులను తిని ,రంధ్రాలు చేసే పెంకు పురుగులు, గొంగళి పురుగులు, నల్ల మచ్చ తెగులు, కొమ్మ ఎండు, బూడిద తెగులు ఆశించి నష్టపరుస్తున్నాయి.