News February 5, 2025

పెళ్లి కార్డు ఇన్విటేషన్ అదిరిపోయిందిగా..

image

పెళ్లి వేడుకలకు ఆహ్వానించేందుకు యువ జంటలు కొత్త మార్గాలను అన్వేషిస్తున్నాయి. ఆధార్ కార్డు ఇన్విటేషన్ మరవకముందే కేరళలో ఓ జంట రేషన్ కార్డు తరహాలో వెడ్డింగ్ కార్డును రూపొందించారు. వరుడు ‘రేషన్ షాప్ బాయ్’గా స్థానికంగా పాపులర్ అవడంతో పెళ్లి కూతురు ఇలా డిజైన్ చేయించిందని సమాచారం. వీరి పెళ్లి ఈ నెల 2న జరిగింది. ఈ కార్డు వైరలవ్వగా క్రియేటివిటీ మాత్రం అదిరిపోయిందని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.

Similar News

News March 6, 2026

బాలెన్ షా.. జెంజీల నయా బాద్‌షా!

image

నేపాల్ వారసత్వ రాజకీయాలపై తిరగబడ్డ Gen-Z ఉద్యమాన్ని బాలెన్ షా ముందుండి నడిపించారు. 36ఏళ్ల ఈ యువనేత.. స్ట్రక్చరల్ ఇంజినీర్, ర్యాపర్, మ్యూజిక్ ప్రొడ్యూసర్, నటుడు, రైటర్, కవిగా నేపాలీలకు సుపరిచితుడు. 2022లో ఖాట్మండు మేయర్‌గా ఎన్నికై ప్రభుత్వాన్ని నిలదీయడంతో యూత్‌లో క్రేజ్ సంపాదించారు. దీంతో ఎన్నికల్లో ఆయనకు భారీగా ఓట్లు పడినట్లు తెలుస్తోంది. తన పార్టీ RSP <<19309327>>విజయం<<>> సాధిస్తే బాలెన్ నేపాల్ PM అవుతారు.

News March 6, 2026

BREAKING: తగ్గిన బంగారం ధరలు

image

హైదరాబాద్ బులియన్ మార్కెట్‌లో బంగారం, వెండి ధరలు ఇవాళ కూడా తగ్గాయి. 24 క్యారెట్ల 10గ్రాముల గోల్డ్ రేటు రూ.770 తగ్గి రూ.1,62,110కు చేరింది. ఐదు రోజుల్లోనే రూ.10,980 తగ్గడం విశేషం. అలాగే 22 క్యారెట్ల 10గ్రాముల గోల్డ్ రేటు రూ.700 పతనమై రూ.1,48,600గా ఉంది. తెలుగు రాష్ట్రాల్లో దాదాపు ఇవే ధరలుండొచ్చు.

News March 6, 2026

న్యూజిలాండ్‌తో అంత ఈజీ కాదు!

image

ఆదివారం T20 WC ఫైనల్లో భారత్-న్యూజిలాండ్ ఢీకొంటాయి. WC చరిత్రలో హెడ్ టు హెడ్ చూస్తే కివీస్ డామినేషన్ స్పష్టంగా కనిపిస్తోంది. ఇరు జట్లు తలపడ్డ 3 మ్యాచుల్లో ఆ జట్టే గెలిచింది. ప్రస్తుత టీమ్‌లో ఫిన్ అలెన్, సీఫర్ట్ భయంకరమైన ఫామ్‌లో ఉన్నారు. రచిన్, ఫిలిప్, చాప్‌మన్, మిచెల్‌తో కూడిన కివీస్ బ్యాటింగ్ లైనప్ శత్రుదుర్భేద్యంగా ఉంది. వీరికి బుమ్రా నేతృత్వంలోని బౌలింగ్ విభాగం ఎలా అడ్డుకట్ట వేస్తుందో చూడాలి.