News March 1, 2025
శ్రీకాళహస్తిలో శివపార్వతుల కళ్యాణోత్సవం

AP: శ్రీకాళహస్తిలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ఇవాళ తెల్లవారుజామున జ్ఞానప్రసూనాంబ సమేత వాయు లింగేశ్వరుడి కళ్యాణోత్సవం కన్నుల పండుగగా జరిగింది. స్వామి, అమ్మవార్లను ఆలయ అలంకార మండపంలో సుందరంగా అలంకరించి పెళ్లి మండపం వద్దకు తీసుకొచ్చారు. ఇదే కళ్యాణ ఘడియలో వందకు పైగా జంటలు మనువాడాయి. వీరికి దేవస్థానం ఆధ్వర్యంలో తాళిబొట్లు, ఇతర పెళ్లి సామగ్రి ఉచితంగా అందించారు.
Similar News
News September 16, 2025
భార్య చివరి కోరిక నెరవేర్చిన భర్త

AP: తనను ఉపాధ్యాయుడిగా చూడాలన్న భార్య చివరి కోరికను తీర్చాడు భర్త. ఎన్టీఆర్(D) రెడ్డికుంటకు చెందిన రామకృష్ణ భార్య ఏడాది క్రితం డెంగీతో మరణించారు. ఇటీవల ఫలితాల్లో స్కూల్ అసిస్టెంట్(బయాలజీ)గా DSCలో ఎంపికయ్యారు. ఆమె చివరి కోరికను తీర్చడానికి రోజుకు 10 గంటలకు పైగా చదివినట్లు రామకృష్ణ తెలిపారు. తన భార్య బతికి ఉంటే సంతోషించేదని ఆయన కన్నీటి పర్యంతమయ్యారు.
News September 16, 2025
వివేకా హత్య కేసులో దర్యాప్తుకు సిద్ధం: సీబీఐ

AP: వైఎస్ వివేకా హత్య కేసులో తదుపరి దర్యాప్తు కొనసాగించేందుకు సిద్ధంగా ఉన్నామని సుప్రీంకోర్టుకు సీబీఐ తెలిపింది. కోర్టు తగిన ఆదేశాలిస్తే ముందుకు వెళ్తామని పేర్కొంది. పిటిషనర్ ఈ కేసులో ఇంకా దర్యాప్తు చేయాలని కోరుతున్నారని చెప్పింది. ఈ మేరకు సీబీఐ అభిప్రాయాన్ని అదనపు సొలిసిటర్ జనరల్ ఎస్వీ రాజు తెలిపారు.
News September 16, 2025
ఈ జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్

TG: రాబోయే 3 గంటల్లో కామారెడ్డి, మెదక్, సంగారెడ్డి జిల్లాల్లో వర్షాలు కురుస్తాయని IMD ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. ఆదిలాబాద్, హనుమకొండ, భూపాలపల్లి, జగిత్యాల, జనగాం, కరీంనగర్, మేడ్చల్, ములుగు, నిర్మల్, నిజామాబాద్, సిరిసిల్ల, సిద్దిపేట, వరంగల్, భువనగిరిలో తేలికపాటి వర్షాలు కురుస్తాయని తెలిపింది. ఈ జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది.