News November 26, 2024

చివరి నిమిషంలో పెళ్లి క్యాన్సిల్.. కారణమిదే

image

అతని నెల జీతం రూ.1.20 లక్షలు. ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగం చేస్తున్నాడు. ఆస్తిపాస్తులు బాగానే ఉన్నాయి. దీంతో పెద్దలు ఓ అమ్మాయితో పెళ్లి నిశ్చయం చేశారు. తీరా పెళ్లి పీటల మీద కూర్చున్నాక యువతి మనసు మార్చుకుంది. తాను GOVT ఉద్యోగిని తప్ప ఎవరినీ పెళ్లి చేసుకోనని తేల్చిచెప్పింది. చేసేదేమీ లేక ఇరు పక్షాలు మ్యారేజ్‌ను రద్దు చేసుకున్నాయి. యూపీ ఫరూఖాబాద్ జిల్లాలో జరిగిన ఈ ఘటన సోషల్ మీడియాలో వైరలవుతోంది.

Similar News

News January 29, 2026

ఆవనూనెతో చర్మ సంరక్షణ

image

ఆవనూనె, కొబ్బరి నూనె కలిపి ముఖంపై మృదువుగా మర్దనా చేయాలి. ఇలా చేయడం వల్ల రక్తప్రసరణ బాగా జరుగుతుంది. మొటిమలు రాకుండా ఉంటాయి. చర్మం నిర్జీవంగా కనిపిస్తున్నప్పుడు పావుకప్పు ఆవనూనెలో రెండు చుక్కల రోజ్‌ ఆయిల్‌ని కలపాలి. దీనికి చెంచా బియ్యప్పిండి చేర్చి పేస్ట్‌లా చేయాలి. దీన్ని ఒంటికి రాసుకుని నలుగులా రుద్దుకోవాలి. ఇది సహజమైన స్క్రబ్‌లా పనిచేస్తుంది. మృతకణాలు తొలగి మెరిసే చర్మం మీ సొంతమవుతుంది.

News January 29, 2026

మణిద్వీపం గురించి మీకు తెలుసా?

image

జగన్మాత లలితా త్రిపుర సుందరి దేవి నివసించే ప్రదేశమే మణిద్వీపం. ఇది భౌతిక ప్రపంచానికి అతీతంగా వైకుంఠం, కైలాసం కంటే ఉన్నతమైనదని పురాణాలు చెబుతున్నాయి. అమ్మవారు ఇక్కడ చింతామణి గృహంలో కొలువై ఉండి విశ్వాన్ని పాలిస్తుంటారు. మణిద్వీపం అంటే అమ్మవారు కాదు. అది ఆమె నివాసం ఉండే ద్వీపం. ఇక్కడ అనంత సంపదలు, రత్నాలు, పారిజాత వనాలు ఉంటాయి. మణిదీప వర్ణన చదివితే దారిద్య్రం తొలగి, సకల శుభాలు కలుగుతాయని నమ్మకం.

News January 29, 2026

రబీ జొన్న పంటలో ఎదుగుదల లోపించిందా?

image

పెరిగిన చలి తీవ్రత కారణంగా రబీలో నాటిన జొన్న పంట ఎదుగుదల కొన్నిచోట్ల లోపించినట్లుగా కనిపిస్తుంది. ఈ సమస్యను అధిగమించడానికి లీటరు నీటికి 19-19-19 మిశ్రమాన్ని 5 గ్రాముల చొప్పున కలిపి వారం వ్యవధిలో రెండుసార్లు పిచికారీ చేయాలి. అలాగే జొన్న పంటలో ఒకవేళ కత్తెర పురుగును గుర్తిస్తే లీటరు నీటికి క్లోరాంట్రానిప్రోల్ 0.4ml లేదా స్పైనటోరమ్ 0.5ml కలిపి పిచికారీ చేయాలని వ్యవసాయ నిపుణులు సూచిస్తున్నారు.