News January 27, 2025
దేశం మొత్తం ఒకటే టైం!

దేశ మొత్తం ఒకే సమయం అమలయ్యేలా కేంద్రం చర్యలు చేపట్టింది. భారత ప్రామాణిక సమయం(IST) వినియోగాన్ని తప్పనిసరి చేస్తూ డ్రాఫ్ట్ రూల్స్ రూపొందించింది. FEB 14లోపు ప్రజల నుంచి అభ్యంతరాలను స్వీకరించనుంది. ఇది అమల్లోకి వస్తే చట్టపరమైన, పాలన, వాణిజ్య, ఆర్థిక, అధికారిక వ్యవస్థల్లో ISTని తప్పక అమలు చేయాలి. ఇతర టైమ్ జోన్లను ప్రస్తావించకూడదు. అంతరిక్షం, సముద్రం, పరిశోధన రంగాలకు దీని నుంచి మినహాయింపు ఉంటుంది.
Similar News
News September 13, 2025
కృష్ణా జలాల వాటాలో చుక్కనీటిని వదలొద్దు: రేవంత్

కృష్ణా జలాల్లో తెలంగాణకు రావాల్సిన న్యాయమైన వాటాను సాధించి తీరాలని సీఎం రేవంత్ న్యాయ నిపుణులను, ఇరిగేషన్ ఇంజినీరింగ్ అధికారులను అప్రమత్తం చేశారు. నికర, మిగులు, వరద జలాల్లో చుక్క నీటిని వదులుకునేది లేదని స్పష్టం చేశారు. అందుకు అవసరమైన ఆధారాలను సిద్ధం చేసి అందించాలని అధికారులు, న్యాయనిపుణులను ఆదేశించారు. ఈ నెల 23 నుంచి ఢిల్లీలో జరిగే ట్రిబ్యునల్ విచారణలో ఈ అంశాలను గట్టిగా వినిపించాలని సూచించారు.
News September 13, 2025
ఆంధ్ర క్రికెట్ హెడ్ కోచ్గా గ్యారీ స్టీడ్

ఆంధ్ర మెన్స్ క్రికెట్ జట్టు హెడ్ కోచ్గా న్యూజిలాండ్ మాజీ హెడ్ కోచ్ గ్యారీ స్టీడ్ను ACA నియమించింది. ఈ నెల 20-25 తేదీల మధ్య ఆయన బాధ్యతలు చేపడతారని సమాచారం. కాగా గ్యారీ ఆధ్వర్యంలో కివీస్ 2019 WC ఫైనల్ చేరుకుంది. అలాగే 2021 WTC టైటిల్ సాధించింది. మరోవైపు ఆంధ్ర గత రంజీ సీజన్లో గ్రూప్-Bలో ఆరో స్థానంలో నిలిచింది. VHTలో గ్రూప్-Bలో నాలుగు, SMATలో ప్రీక్వార్టర్ ఫైనల్ వరకూ వెళ్లింది.
News September 13, 2025
బాగా నమిలి తినండి: వైద్యులు

ఆహారాన్ని గబగబా తినొద్దని, అలా చేస్తే సరిగ్గా జీర్ణం కాదని వైద్యులు చెబుతున్నారు. ఎంత తక్కువ సమయంలో తినడం పూర్తి చేస్తే అంత ఎక్కువగా బరువు పెరిగే అవకాశం ఉంటుందని అంటున్నారు. వేగంగా, నమలకుండా తింటే సరిపడనంత తిన్నామనే భావన కలగదని.. అరగంట పాటు నెమ్మదిగా, బాగా నమిలి తినాలని సూచిస్తున్నారు. దీనివల్ల అది పూర్తిగా జీర్ణమై పోషకాలన్నీ శరీరానికి అందుతాయని, అలాగే దవడలకూ మేలు జరుగుతుందని వివరిస్తున్నారు.