News April 10, 2024

దేశమంతా ‘కుష్’.. ఎమర్జెన్సీ విధించిన అధ్యక్షుడు

image

ఆఫ్రికా దేశం సియెర్రా లియోన్‌ మత్తులో ఊగిపోతోంది. దీంతో దేశాధ్యక్షుడు బయో ఎమర్జెన్సీ విధించారు. నిత్యం అంతర్గత కలహాలతో రగిలిపోయే సియెర్రా ప్రజలు ‘కుష్’ అనే డ్రగ్స్‌కు విపరీతంగా అలవాటుపడ్డారు. మరోవైపు మనిషి ఎముకల పొడిని కలిపి కుష్‌ను తయారు చేస్తారని తేలడంతో డ్రగ్ డీలర్లు సమాధులు తవ్వించి మరీ శవాలను ఎత్తుకెళ్తున్నారు. ఈ డ్రగ్స్ తీసుకోవడం వల్ల వందల మంది మృత్యువాత పడ్డట్లు తెలుస్తోంది.

Similar News

News November 15, 2024

బీసీ రిజర్వేషన్లపై రేపటి నుంచి సలహాల స్వీకరణ!

image

TG: స్థానిక సంస్థల్లో బీసీ రిజర్వేషన్ల నిర్ధారణపై అధ్యయనం కోసం ప్రభుత్వం ఏర్పాటు చేసిన డెడికేటెడ్ కమిషన్ రేపటి నుంచి బహిరంగ విచారణ చేపట్టనుంది. ఉమ్మడి జిల్లాల కలెక్టరేట్ల పరిధిలో ప్రతిరోజు ఉ.11:30 నుంచి మ.3 గంటల వరకు ప్రజల నుంచి సలహాలు, వినతులు స్వీకరించనుంది. రేపు నల్గొండ, ఈనెల 17న ఖమ్మం, 18న మహబూబ్‌నగర్ జిల్లాలో బహిరంగ విచారణ నిర్వహించనుంది.

News November 15, 2024

కడప పెద్దదర్గా ఉత్సవాలకు సర్వం సిద్ధం

image

AP: మత సామరస్యానికి ప్రతీకగా నిలిచే కడప పెద్దదర్గా ఉరుసు ఉత్సవాలకు నేడు శ్రీకారం చుట్టనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. రేపు గంధం, ఎల్లుండి ఉరుసు, 18న ముషాయిరా ఉంటాయని చెప్పారు. 20వ తేదీన రాత్రి ఊరేగింపు ఉంటుందన్నారు. ఇందుకోసం పటిష్ఠ ఏర్పాట్లు చేసినట్లు కలెక్టర్ చెరుకూరి శ్రీధర్ వెల్లడించారు. ఈ ఉత్సవాలకు రామ్ చరణ్, ఏఆర్ రెహమాన్ సహా పలువురు ప్రముఖులు హాజరుకానున్నారు.

News November 15, 2024

నెలకు రూ.5వేలు.. నేడే లాస్ట్ డేట్

image

కేంద్రం అమలు చేస్తున్న ‘పీఎం ఇంటర్న్ షిప్’ పథకానికి దరఖాస్తు గడువు నేటితో (నవంబర్ 15) ముగియనుంది. దీని ద్వారా ప్రభుత్వం టాప్-500 కంపెనీల్లో యువతకు ఏడాది పాటు ఇంటర్న్‌షిప్ అవకాశం కల్పిస్తుంది. టెన్త్, ఇంటర్, ఐటీఐ, డిగ్రీ చదివి, 21-24 ఏళ్ల వయసు కలిగిన వారు అర్హులు. ఎంపికైన వారికి ప్రభుత్వం నెలకు రూ.5వేలు స్టైఫండ్ ఇస్తుంది. https://pminternship.mca.gov.in సైట్‌లో అప్లై చేసుకోవచ్చు.