News November 11, 2024
ఆటంతా IPLలోనే.. అభిషేక్‌పై విమర్శలు

దక్షిణాఫ్రికాతో రెండో టీ20లోనూ భారత యంగ్ ఓపెనర్ అభిషేక్ శర్మ నిరాశపరిచారు. దీంతో ఆయన ప్రదర్శనపై నెట్టింట విమర్శలు వ్యక్తమవుతున్నాయి. అభిషేక్ కేవలం IPLలోనే ఆడుతారని దుయ్యబడుతున్నారు. అంతర్జాతీయ టీ20ల్లో జింబాబ్వేపై సెంచరీ మినహా ఆయన పెద్దగా రాణించింది లేదని, రుతురాజ్ వంటి ప్లేయర్లకు అవకాశం ఇవ్వాలని అంటున్నారు. కాగా గత సీజన్లో సత్తా చాటిన అభిషేక్‌ను SRH రిటైన్ చేసుకున్న సంగతి తెలిసిందే.
Similar News
News February 10, 2026
11 నంబర్ చూసి భయపడి దాక్కుంటావా: అచ్చెన్న

AP: రేపటి నుంచి అసెంబ్లీ సమావేశాలు ప్రారంభంకానున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో మంత్రి అచ్చెన్నాయుడు YCP చీఫ్ జగన్‌కు ఛాలెంజ్ విసిరారు. ‘నాడు ప్రజలు ఇచ్చింది 11 సీట్లు, రేపు అసెంబ్లీ మొదలయ్యేది 11వ తేదీ! ఆ నంబర్ చూసి భయపడి ఇంట్లో దాక్కుంటావా.. లేక పులివెందుల ఎమ్మెల్యేగా దమ్ముంటే అసెంబ్లీకి వస్తావా?’ అని ట్వీట్ చేశారు. రేపు ఉదయం 10.30 గంటలకు గవర్నర్ ఉభయ సభలను ఉద్దేశించి ప్రసంగిస్తారు.
News February 10, 2026
ఉలవ పంటలో కాయ ఈగ – నివారణకు సూచనలు

ఉలవ పంటను ఆశించే కాయ ఈగ అన్ని దశలను కాయ లోపలే పూర్తి చేసుకొని తల్లి పురుగు మాత్రమే బయటకు వస్తుంది. అందుకే కాయ లోపల జరిగే నష్టం మనకు కనిపించదు. తల్లి పురుగు లేత పిందె దశలో కాయలపై గుడ్లు పెడుతుంది. కాబట్టి పిందె దశలో 5% వేప గింజల కషాయం పిచికారీ చేస్తే గుడ్లు పెట్టకుండా నివారించవచ్చు. గింజ గట్టిపడే దశలో లీటరు నీటికి ప్రొఫెనోఫాస్ 50% ఇ.సి 2ML లేక థయోమిథాక్సామ్ 25% W.G 0.4గ్రా కలిపి పిచికారీ చేయాలి.
News February 10, 2026
రేవంత్ మతం మార్చుకున్నా అభ్యంతరం లేదు: కిషన్ రెడ్డి

TG: ‘కిషన్ రావు’ అంటూ CM రేవంత్ చేసిన <<19085836>>విమర్శలకు<<>> కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కౌంటరిచ్చారు. ‘నా పేరును మార్చే అధికారం మీకు లేదు. రేవంత్ ఖాన్ అని మీరు గర్వంగా చెప్పుకున్నారు. మీరు పేరు, మతం మార్చుకున్నా మాకు అభ్యంతరం లేదు. మజ్లిస్‌తో మీరు కాపురం చేసినన్ని రోజులు మేం నిప్పులు పోస్తాం. KCRకి నేను దత్తపుత్రుడినని విమర్శించారు. నేనెవరికీ దత్తపుత్రుడిని కాదు’ అని ఢిల్లీ ప్రెస్మీట్లో మండిపడ్డారు.


