News April 25, 2024
చెల్లి పెళ్లికి గిఫ్ట్స్ ఇస్తున్నాడని భర్తను చంపించిన భార్య

యూపీలో దారుణం జరిగింది. భర్తను భార్య తన సోదరులతో హత్య చేయించింది. బారాబంకీకి చెందిన చంద్రశేఖర్ (35) తన చెల్లికి ఈ నెల 26న పెళ్లి నిశ్చయం కావడంతో టీవీ, గోల్డ్ రింగ్ బహుమతిగా ఇవ్వాలనుకున్నాడు. ఇది నచ్చని అతడి భార్య గొడవకు దిగింది. తన సోదరులను పిలవడంతో వారు చంద్రశేఖర్‌ను గంటపాటు కర్రలతో కొట్టారు. ఆస్పత్రికి తరలించగా చికిత్స తీసుకుంటూ చనిపోయాడు. మృతుడి భార్యతో పాటు ఐదుగురిని పోలీసులు అరెస్టు చేశారు.
Similar News
News November 29, 2025
క్వాలిటీ టెస్టులో పతంజలి ఆవు నెయ్యి ఫెయిల్.. రూ.లక్ష జరిమానా

ఉత్తరాఖండ్ పిథోర్‌గఢ్‌లోని బాబా రాందేవ్‌కు చెందిన పతంజలి కంపెనీకి ఫుడ్ సేఫ్టీ అధికారులు జరిమానా విధించారు. ఆ సంస్థ ఉత్పత్తి చేసిన ఆవు నెయ్యి క్వాలిటీ టెస్టులో ఫెయిలైంది. ఆ నెయ్యి వినియోగానికి పనికిరాదని నిర్ధారించిన అధికారులు రూ.లక్ష ఫైన్ వేశారు. దాంతో సైడ్ ఎఫెక్ట్స్‌తో పాటు అనారోగ్యం బారిన పడే ప్రమాదం ఉందని తెలిపారు.

ఈ ఫైనాన్స్ జాబ్స్‌తో నెలకు రూ.లక్షపైనే జీతం

భారతదేశ ఫైనాన్స్ సెక్టార్లో ఇన్వెస్ట్మెంట్ బ్యాంకింగ్ నుంచి ఫిన్‌టెక్, రిస్క్ మేనేజ్మెంట్ వంటి విభాగాల్లో ఎంట్రీలెవల్లోనే నెలకు రూ.లక్షపైనే జీతం ఆఫర్ చేస్తున్నారు. ఇన్వెస్ట్మెంట్ బ్యాంకింగ్‌లో అత్యధికంగా M&A అనలిస్ట్‌కు ఏడాదికి రూ.30 లక్షల వరకు, ఫిన్‌టెక్ ఫైనాన్షియల్ అనలిస్టుకు ఏడాదికి రూ.20 లక్షల వరకు, రిస్క్ మేనేజ్మెంట్లో క్వాంట్ రిస్క్ అనలిస్టుకు ఏడాదికి రూ.25 లక్షల వరకు ఆఫర్ చేస్తున్నారు.