News November 24, 2024
భర్త ఆత్మహత్యను వీడియో రికార్డు చేసిన భార్య

భర్త(29) ఆత్మహత్య చేసుకుంటుండగా నిలువరించాల్సింది పోయి ఆ ఘటనను ఫోన్‌లో రికార్డు చేసిన భార్య(29)పై మహారాష్ట్ర థానే పోలీసులు కేసు నమోదు చేశారు. భార్యాభర్తలిద్దరూ నిత్యం గొడవపడేవారు. ఈ క్రమంలో నవంబర్ 20న ఉరివేసుకొని భర్త ఆత్మహత్య చేసుకున్నారు. ఆ సమయంలో అక్కడే ఉండి భర్తను కాపాడకుండా భార్య వీడియో రికార్డు చేసింది. మృతుడి తల్లి ఫిర్యాదుతో పోలీసులు భార్యపై కేసు నమోదు చేశారు.
Similar News
News October 29, 2025
ఆ పోస్టులు ఖాళీగా లేవు.. అమిత్ షా కీలక వ్యాఖ్యలు

బిహార్‌లో ఎన్డీయే సీఎం అభ్యర్థి నితీశ్ కుమారేనని కేంద్ర హోం మంత్రి అమిత్ షా స్పష్టం చేశారు. ‘బిహార్‌లో సీఎం పోస్టు, ఢిల్లీలో ప్రధాని సీటు ఖాళీగా లేవు. ఇక్కడ నితీశ్ ఉన్నారు. అక్కడ మోదీ ఉన్నారు. మీకు (ఆర్జేడీ, కాంగ్రెస్) ఛాన్స్ రాదు’ అని అన్నారు. జంగిల్ రాజ్ నుంచి బిహార్‌ను రక్షించుకునేందుకే ఈ ఎన్నికలని చెప్పారు. ఒక్క పొరపాటు జరిగినా రాష్ట్రం 20 ఏళ్లు వెనక్కి వెళ్తుందని ప్రజలను హెచ్చరించారు.
News October 29, 2025
‘మొంథా’తో ఏపీకి తీవ్ర నష్టం: CBN

‘మొంథా’తో ఏపీకి తీవ్రనష్టం వాటిల్లిందని CM CBN తెలిపారు. తుఫాను తాకిన ప్రాంతంలో తీవ్ర గాలులు, ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లో భారీ వర్షాలతో నష్టం వాటిల్లిందని వివరించారు. ‘ఈ పెనువిపత్తును ముందస్తు జాగ్రత్తలతో సమర్థంగా ఎదుర్కొన్నాం. ఎక్కువ ప్రాణ నష్టం, ఆస్తినష్టం లేకుండా కాపాడుకోగలిగాం. 200 క్యాంపుల్లో 1.80 లక్షల మందికి ఆశ్రయమిచ్చాం. యంత్రాంగం సమష్టిగా పనిచేసి ప్రజలను కాపాడింది’ అని వెల్లడించారు.
News October 29, 2025
కురవని కృత్రిమ వర్షం.. క్లౌడ్ సీడింగ్ వాయిదా!

కృత్రిమ వర్షంతో కాలుష్యాన్ని నియంత్రించాలన్న ఢిల్లీ ప్రభుత్వ ప్రయత్నాలు ఆశించిన ఫలితాలివ్వలేదు. మేఘాల్లో తేమ తక్కువగా ఉండటంతో క్లౌడ్ సీడింగ్ ట్రయల్స్ సక్సెస్ కాలేదు. దీంతో ఈ రోజు నిర్వహించాల్సిన సీడింగ్‌ను వాయిదా వేశారు. మేఘాల్లో తేమ ఎక్కువగా లేకపోవడంతో ఈ నిర్ణయం తీసుకున్నామని మంత్రి మంజీందర్ సిర్సా తెలిపారు. కాగా మొత్తంగా ₹3.2 కోట్ల ఖర్చుతో 5సార్లు ట్రయల్స్ నిర్వహించాలని ప్లాన్ చేశారు.


